ప్రభుత్వ జాతీయ ఆరోగ్య అథారిటీ (NHA) వెబ్సైట్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకం ద్వారా 10.74 కోట్ల కంటే ఎక్కువ పేద కుటుంబాలు అంటే దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూర నుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ‘ఆయుష్మాన్ కార్డులను’ (Ayushman Cards) ఉచితంగా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. గతంలో ఈ కార్డు కోసం రూ. 30 వసూలు చేయగా.. ఇప్పుడు వాటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీని ద్వారా పేదలపై చిన్న భారం పడకుండా ఉచితంగా సేవలు అందించినట్టు ఉంటుందని ప్రభుత్వం తెలపింది.
డూప్లికేట్ కార్డు కూడా పొందవచ్చు..
ఆయుష్మాన్ కార్డు ద్వారా లబ్దిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ కార్డులను దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్ల (Common Service Centers) లో లభిస్తాయి. ఇక ఆయుష్మాన్ డూప్లికేట్ కార్డులు పొందేందుకు రూ. 15 చెల్లించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ అధారిటీ(ఎన్హెచ్ఏ) ద్వారా లబ్దిదారులకు ఉచితంగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
Jammu and Kashmir: మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: ఫరూక్ అబ్దుల్లా
ఏమిటీ స్కీమ్..
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి జాన్ ఆరోగ్య యోజనా లేదా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం లేదా పీఎంకేర్ అని పిలుస్తారు. ఈ పధకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల కుటుంబాలకు ఏటా రూ.10 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తోంది. ఇక వారు ఉచితంగా చికిత్స చేయించుకునేందుకు ఆయుష్మాన్ కార్డులు అవసరమని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద క్యాన్సర్తో సహా సుమారు 1300కిపైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఈ పధకానికి మీరు అర్హులై ఉండి.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే.. మీ దగ్గర ‘ఆయుష్మాన్ కార్డు’ ఉండాలి. ఆయుష్మాన్ కార్డును ‘ఆయుష్మాన్ భారత్ యోజన గోల్డెన్ కార్డు’ అని కూడా పిలుస్తారు.
ఎవరు అర్హులు?
గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు వారి ఆర్థిక స్థితిని బట్టి ఈ పథకంలోకి వస్తారు. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు వారి పని ఆధారంగా వర్గీకరించబడ్డారు.
Pakistan: "దయ చూపినందుకు ధన్యవాదాలు".. సౌదీ అప్పుపై పాక్ ప్రధాని ఆర్థిక సలహాదారు ట్వీట్
కార్డుకు సంబంధించిన వివరాలు..
- గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లబ్దిదారులు ఈ కార్డును పొందేందుకు ప్రభుత్వం ప్రజా సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- పథకం పొందాలనుకొనే వారు ఏదైనా ఐడీ ప్రూఫ్ చూపించి ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు.
- కేంద్రం తాజా నిబంధన ప్రకారం పథకానికి అనుసంధానమైన కుటుంబంలోని మహిళ పెళ్లి చేసుకుంటే.. ఆమె భర్తకు ఉచితంగా చికిత్స కోసం కొరకు ఆయుష్మాన్ కార్డు లేదా డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకొన్న యువతి ఆధార్ కార్డు చూపిస్తే చాలని కేంద్రం తెలిపింది.
- ఆయుష్మాన్ భారత్ యోజన పథకానికి అర్హత ఉందో లేదో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సులభమైన మార్గాలను అందించింది.
- టోల్ ఫ్రీ నంబర్లయిన 14555 / 1800111565 కు డయల్ చేస్తే మీ అర్హత తదితర వివరాలు తెలియజేస్తారు.
- అంతే కాకుండా అధికారిక వెబ్సైట్ https://mera.pmjay.gov.in/search/login ను సందర్శించి మీ అర్హత వివరాలు, దరఖాస్తు సమాచారం తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.