• Home
 • »
 • News
 • »
 • national
 • »
 • AYUSH MINISTRY GUIDELINES CENTRAL AYUSH MINISTRY ISSUES GUIDELINES TO PROTECT CHILDREN FROM COVID 19 HERE ARE THE FULL DETAILS TO KNOW NK

Ayush Ministry Guidelines: పేరెంట్స్ ఆలర్ట్... పిల్లల రక్షణపై కేంద్రం మార్గదర్శకాలు

Ayush Ministry Guidelines: పేరెంట్స్ ఆలర్ట్... పిల్లల రక్షణపై కేంద్రం మార్గదర్శకాలు (image credit - twitter - reuters)

Ayush Ministry Guidelines: కరోనా సెకండ్ వేవ్ ముగుస్తోందనేది క్లియర్‌గా తెలుస్తోంది. సో... థర్డ్ వేవ్‌కి కేంద్రం రెడీ అవుతోంది. అందుకోసం పిల్లలకు సంబంధించి కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.

 • Share this:
  Ayush Ministry Guidelines: కరోనా వ్యాప్తికి సంబంధించి పిల్లలను మనం 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. మొదటిది... పిల్లలకు కరోనా రాకుండా చూడటం. 2వది... పిల్లల వల్ల పెద్ద వాళ్లకు కరోనా రాకుండా చూడటం. ఈ రెండు అంశాలూ ముఖ్యమే కాబట్టి... వీటిపై కేంద్రంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆయుర్వేద మందులు, నాత్రాస్యూటికల్స్, మాస్కులు ధరించడం, యోగా చెయ్యడం, ఐదు రకాల హెచ్చరికలను గమనిస్తూ ఉండటం, టెలి-కన్సల్టేషన్లు జరపడం, పేరెంట్స్‌కి వ్యాక్సినేషన్ వంటి అంశాలను గైడ్‌లైన్స్‌లో చేర్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఓ డాక్యుమెంట్ తయారుచేసి... గైడ్‌లైన్స్ జారీ చేసింది.

  "పెద్దలతో పోల్చితే... పిల్లల్లో కరోనా సోకడం, లక్షణాలు తక్కువే... కాబట్టి వారికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఏదీ అవసరం లేదు. కాకపోతే... ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా నుంచి పిల్లల్ని కాపాడవచ్చు" అని 58 పేజీల డాక్యుమెంట్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

  గైడ్ లైన్స్ ప్రకారం... ఇప్పటివరకూ పిల్లలపై చాలా పరిశోధనలు జరిగాయి. కొన్ని ఆయుర్వేద మందులు పిల్లలకు సోకిన కరోనాను నివారించడంలో బాగా పనిచేశాయి. ఒబెసిటీ (అధిక బరువు), టైప్ 1 డయాబెటిస్, క్రోనిక్ కార్డియో పల్మనరీ వ్యాధి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే పరిస్థితులు వంటివి పిల్లలకు సంబంధించి ప్రమాదకర అంశాలు అని డాక్యుమెంట్ తెలిపింది. "పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కివే. అయితే... రకరకాల మ్యూటెంట్ వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ప్రోటోకాల్ ఫాలో అవ్వడం అవసరం" అని డాక్యుమెంట్‌లో తెలిపారు.

  పిల్లలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం ఒకింత కష్టమే. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. పిల్లల తల్లిదండ్రులు అర్హత ఉన్న ఆయుష్ ఫిజీషియన్‌ను కలిసి... పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహాలు తీసుకోవాలి అని కేంద్ర ఆయుష్ శాఖ కోరింది.

  పిల్లలకు సలహాలు:
  - తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి.
  - ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి.

  పిల్లలు చేతులు కడుక్కోకపోతే... వారికి చాక్లెట్ ఇస్తాననో, బిస్కెట్ ఇస్తాననో ఆశ చూపి... వారితో ఆ పని చేయించాలి అని డాక్యుమెంట్‌లో తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. 2 నుంచి 5 ఏళ్ల పిల్లలకు కూడా మాస్క్ ఉంటే మంచిదే. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్క్ వాడాలి.

  ఎలాంటి మాస్కు వాడాలి?
  - పిల్లలకు కాటన్ మాస్కులు 3 పొరలు ఉన్నవి మంచివి. అవి రంగులతో ఉంటే పిల్లలకు బాగా నచ్చుతాయి అని ఆయుష్ శాఖ తెలిపింది.
  - పిల్లలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. తమ ఫ్రెండ్స్, బంధువులతో వారు వీడియో చాట్లు, ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకోవాలి.

  పిల్లల్లో 5 లక్షణాలు:
  పిల్లల్లో కరోనా లక్షణాలు ఉంటే... వారు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోని పెద్దవారిని కలవకూడదు. తల్లిదండ్రులు పిల్లల్లో 5 లక్షణాలపై ఫోకస్ పెట్టాలి. అవి... జ్వరం కంటిన్యూగా 4 నుంచి 5 రోజులు ఉంటే, ఆహారం సరిగా తినకుండా ఉంటే, పిల్లల్లో సహజత్వానికి భిన్నంగా అలసటగా ఉంటే, ఊపిరి రోజూలా కాకుండా వేగంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే (సరిగా ఊపిరి ఆడకపోతే అలా చేస్తారు), రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం కంటే తగ్గితే.... వీటిలో ఏ లక్షణం కనిపించినా... వెంటనే పేరెంట్స్ డాక్టర్ సలహా తీసుకోవాలి.

  తీసుకోవాల్సిన చర్యలు:
  - పిల్లలు గోరు వెచ్చటి నీరు తాగాలి.
  - పండ్లు బాగా తోముకోవాలి. ఉదయం రాత్రి కూడా. 2 ఏళ్లకు పైబడిన వారికి ఈ సలహా.
  - 5 ఏళ్లు దాటిన పిల్లలు గోరు వెచ్చటి నీటితో ఆయిల్ పుల్లింగ్, పుక్కిలింత వంటివి చెయ్యాలి.
  - 5 ఏళ్లు దాటిన పిల్లలు... యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ (ధ్యానం) వంటివి చెయ్యాలి. ఆయిల్ మాజ్ చేసుకోవాలి. అలాగే ముక్కుకి ఆయిల్ రాసుకోవాలి.

  పాలలో పసుపు వేసుకొని తాగడం, చవన్ ప్రాష్ వాడటం, సంప్రదాయ మూలికలతో తయారుచేసిన డికాక్షన్ తాగడం, ఆయుర్వేద మందులు వాడటం వంటివి కరోనా లక్షణాలు ఉన్న పిల్లలకు చెయ్యాలి. వీటిని ఆయుర్వేద ప్రాక్టీషనర్ల పర్యవేక్షణలోనే చెయ్యాలి.

  పిల్లలు ఇలా చెయ్యాలి:
  - పిల్లలు బాగా నిద్రపోవాలి.
  - తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తినాలి. సమతుల ఆహారం తినాలి.

  -పిల్లలు ఆడే ప్రదేశంలో రోజూ సాయంత్రం వేళ యాంటీ-మైక్రోబయల్ ఫ్యూమిగేషన్ చెయ్యాలి. (సూక్ష్మజీవులు రాకుండా ఏర్పాట్లు)
  - పిల్లలు నిద్రపోయే మంచాలు, బట్టలు, బొమ్మలకు కూడా ఫ్యూమిగేషన్ చెయ్యాలి.

  ఇది కూడా చదవండి: E-Bike: తేలికైన ఎలక్ట్రిక్ బైక్... మడత పెట్టి పట్టుకుపోవచ్చు... ఫొటోలు, వీడియో చూడండి

  ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలను కాపాడాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది.
  Published by:Krishna Kumar N
  First published: