అయోధ్య తీర్పు రాసిందెవరు?... తెలిస్తే షాక్ అవ్వరు

Ayodhya Verdict 2019 : 130 ఏళ్ల సమస్యకు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు... తీర్పును ఎవరు రాశారో మాత్రం సీక్రెట్‌గా ఉంచడం విశేషం.

news18-telugu
Updated: November 10, 2019, 5:35 AM IST
అయోధ్య తీర్పు రాసిందెవరు?... తెలిస్తే షాక్ అవ్వరు
అయోధ్య తీర్పు రాసిందెవరు?... తెలిస్తే షాక్ అవ్వరు
  • Share this:
Ayodhya Verdict 2019 : అయోధ్య కేసులో తీర్పు భారత్‌నే కాదు... యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. తీర్పును చదివేటప్పుడు... కాసేపు హిందువులకు, కాసేపు ముస్లింలకు... ఇలా రకరకాల మలుపులు తిప్పారు. అసలు విషయాన్ని ముందు చెప్పకుండా... అలాంటి నిర్ణయానికి ఎందుకు రావాల్సి వచ్చిందో ముందుగా వివరిస్తూ తీర్పు ఇవ్వడం అందరికీ నచ్చింది. జస్ట్ అరగంటలో ఇచ్చిన తీర్పు... నిజానికి 1024 పేజీల సారాంశం. అన్ని పేజీల తీర్పు చదవాలంటే... రెండు, మూడు రోజులు పట్టొచ్చు. ఇంతకీ సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఇంత భారీ తీర్పును రాసింది ఎవరన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. తీర్పు రాగానే... ఐదుగురు సభ్యుల్లో హిందువులు ఎవరు, ముస్లింలు ఎవరన్న ప్రశ్న తలెత్తింది. అదే విధంగా... ఆ తీర్పు కాపీని రాసింది ఎవరన్న ప్రశ్న కూడా మొదలైంది. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే... తీర్పు ఎవరు రాసిందీ బెంచ్ వివరించలేదు.

జనరల్‌గా సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా... తీర్పు రాసిందెవరో కచ్చితంగా చెబుతుంది. అలాంటిది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించిన కేసులో మాత్రం భిన్నంగా జరిగింది. తీర్పు రాసిన వ్యక్తికి మతాన్ని ముడిపెడతారన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఇలా సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఐతే... ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును ఎకగ్రీవంగా ఇవ్వడం వల్ల... అందరూ ఈ తీర్పును ఆహ్వానించారు. అదే ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరిద్దరు తీర్పుకు వ్యతిరేకమైన భావనలు వ్యక్తం చేసి ఉంటే... అప్పుడు ప్రజల ఆలోచనా ధోరణి ఎలా ఉండేదన్నది మరో ప్రశ్న. ఇదివరకు లక్నో బెంచ్ ఇచ్చిన తీర్పులో... భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. ఈసారి మాత్రం భారతీయులంతా ఈ తీర్పుకి ఓకే చెప్పారు.

116 పేజీల సంగతేంటి : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏకగ్రీవంగా ఇచ్చినా... ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో... ఒకరు మాత్రం తన అభిప్రాయాన్ని విడిగా చెప్పారు. ఆ అభిప్రాయానికి సంబంధించి మొత్తం తీర్పు కాపీలో... 116 పేజీలు వేరే ఉన్నాయి. ఐతే... ఆ ఒక్క జడ్జి ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. ఇది కూడా రొటీన్‌కి భిన్నమే. అయినప్పటికీ ఈ తీర్పును అందరూ స్వాగతించారు. ఎలాంటి భిన్నాభిప్రాయాలూ వ్యక్తం చేయకుండా దేశం మొత్తం... సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించింది.


Pics : ఎంతందంగా ఉన్నావే... నిఖిలా విమల్ క్యూట్ ఫొటోస్...
ఇవి కూడా చదవండి :

Health Tips : ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు


Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...

Published by: Krishna Kumar N
First published: November 10, 2019, 5:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading