Ayodhya Verdict : అయోధ్యలో నిర్మించబోయేది ఆషామాషీ రామాలయం కాదు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించబోతున్నారు. మనం మైండ్ బ్లోయింగ్ అంటామే అలా. షాకింగ్ విషయమేంటంటే... అంత అద్భుతమైన ఆలయ నిర్మాణ పనులు ప్రస్తుతం చాలా చాలా నెమ్మదిగా ఉన్నాయి. అయోధ్యలోని కరసేవకపురంలో ఇప్పుడు ఇద్దరు శిల్పులు, నలుగురు సిబ్బంది మాత్రమే గుడి పనులు చూసుకుంటున్నారు. 1990ల్లో ఎలాగైనా గుడి కట్టేయాలనే పట్టుదలతో ఉన్నప్పుడు... 150 మంది శిల్పులు పనిచేసేవాళ్లు. ఆ తర్వాత కోర్టుల తీర్పులు... పనులకు బ్రేక్ వేశాయి. ఇప్పుడు సుప్రీంకోర్టే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో... కరసేవకులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఐదేళ్లలో టెంపుల్ కట్టేస్తామంటున్నారు. అంతా పూర్తయ్యాక అది 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 128 అడుగుల ఎత్తులో ఉంటుందని చెప్పారు. రామ మందిరం రెండంతస్తుల్లో ఉంటుంది. పైన శిఖరం అదనంగా ఉంటుంది. ఒక్కో అంతస్తులో శిల్పాలతో 106 స్తంభాలు ఉంటాయి. (మొత్తం 212) ఇవాళ్టి నుంచీ పనులు జోరందుకోనున్నాయి.
పాయింట్ల రూపంలో వివరాలు :
- ఆలయ నిర్మాణం మొదలుపెట్టింది 1989లో
- 1989లో రాజస్థాన్ నుంచీ 2 ట్రక్కుల్లో పాలరాళ్లు అయోధ్యకు తెప్పించారు.
- రాజస్థాన్... భరత్‌పూర్ దగ్గర్లో బాన్సిపహర్ నుంచీ గ్రానైట్, పాలరాళ్లు వచ్చాయి.
- 1993 జనవరి 23న రామజన్మభూమి న్యాస్ ఏర్పాటైంది. ఈ సంస్థే ఆలయ నిర్మాణం సంగతి చూసుకుంటోంది.
- రామజన్మభూమికి 1 కిలోమీటర్ దూరంలోనే కరసేవకపురం ఉంది.
- 1992 నుంచీ సిద్ధం చేసిన శిల్పాలు ఇప్పటికే దుమ్ముపట్టాయి. ప్రతి రోజూ వాటిని శుభ్రం చేస్తూనే ఉన్నారు. రోజూ ఉదయం 7 నుంచీ సాయంత్రం 5వరకూ పనులు చేస్తున్నారు.
- కరసేవకులు (శిల్పాలు చెక్కేవాళ్లు) ఆగ్రా, రాజస్థాన్, గుజరాత్ నుంచీ వచ్చారు.
- ఆలయ నిర్మాణానికి భక్తులే నిధులు ఇచ్చారు. వాటికి ట్రస్ట్ (రామజన్మభూమి న్యాస్) టాక్స్ చెల్లిస్తోంది కూడా.
- ఆ శిల్పాలు, స్తంభాల్ని చూసేందుకు రోజూ 1000 మంది దాకా పర్యాటకులు వస్తున్నా్రు.
రామాలయం ప్రత్యేకతలు ఇవీ:
- రామాలయం మొత్తం రామాయణ గాధతో నిండిపోతుంది.
- స్తంభాల్లో రెండు రకాలుంటాయి. కొన్ని 16.5 అడుగులు, మరికొన్ని 14.5 అడుగుల ఎత్తుంటాయి. పెద్దవి మొదటి అంతస్థు (గ్రౌండ్ ఫ్లోర్), చిన్నవి పై అంతస్థు కోసం.
- ప్రతీ స్తంభంపై 16 బొమ్మలు, ప్రతిమలు, శిల్పాలు చెక్కుతారు.
- స్తంభాలపై లతలు, పూలు, దేవుళ్ల బొమ్మలుంటాయి.
- తెలుపు, గులాబీ రంగులో ఉండే రాళ్లను స్తంభాలుగా చేస్తున్నారు.
- ఆలయ రూపురేఖల నమూనాను కరసేవకపురంలో ఓ గాజుపెట్టెలో ఉంచారు. అలాగే నిర్మిస్తారు.
- ఆలయం దగ్గరే ఓ వేద పాఠశాల ఉంటుంది. సాంస్కృతిక శిక్షణా కేంద్రం కూడా ఉంటుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస మూవీ హీరోయిన్ శ్రుతి శర్మ క్యూట్ స్టిల్స్
ఇవి కూడా చదివేయండి :
IND vs BAN : నేడు మూడో టీ20... గెలిస్తే సిరీస్ మనదే
అయోధ్య తీర్పు రాసిందెవరు?... తెలిస్తే షాక్ అవ్వరు
Health Tips : ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...
Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు
Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict, Supreme Court, Uttarpradesh