వెల్లివిరిసిన మతసామరస్యం... అయోధ్య ఆలయంలో ఇఫ్తార్ విందు

ఈ విందుకు ఏ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించడంలేదని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు,

news18-telugu
Updated: May 20, 2019, 3:47 PM IST
వెల్లివిరిసిన మతసామరస్యం... అయోధ్య ఆలయంలో ఇఫ్తార్ విందు
ఇఫ్తార్ విందు ( ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 20, 2019, 3:47 PM IST
అయోధ్య రామమందిరం అనగానే...అందరికీ హిందూ ముస్లీం గొడవలే గుర్తుకు వస్తాయి. కానీ అక్కడ ప్రజలు మాత్రం హిందూ ముస్లీం భాయి భాయి అన్న మాటను నిజం చేస్తున్నారు. ప్రస్తుతం ముస్లీంల అతి పవిత్ర మాసం రంజాన్ నడుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అద్బుత ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం కాబోతుంది.
రంజాన్ సందర్భంగా రామజన్మభూమి సమీపంలోని ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన సరయు కుంజ్ ఆలయంలో ముస్లిం సోదరులకు సోమవారం విందు ఇవ్వనున్నారు. అయితే, ఈ విందుకు ఏ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించడంలేదని ఆలయ ప్రధాన పూజారి మహంత్ జుగల్ కిశోర్ శరన్ శాస్త్రి వ్యాఖ్యానించారు.

అయోధ్యలో శాంతి, సామరస్యాలను ప్రోత్సహించడమే తమ అభిమతని చెబుతున్నారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంతో ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్ నెలలో ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీలు ఇస్తుంటారు. రాజకీయ నేతలు కూడా పార్టీలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలు జరుగుతుంటాయి. అలాగే పవిత్ర రంజాన్ నెలలో ఆయోధ్యలోని హిందూ పండితులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకు ఆహ్వానించే సంప్రదాయం ఉందని తెలిపారు. గతంలో అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌గర్హి ఆలయంలోనూ ముస్లింలకు ఇఫ్తార్‌ను ఇచ్చిన విషయం గుర్తుచేశారు.

First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...