రామమందిర నిర్మాణం ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో చూడండి

Ayodhya Ram mandir: మూడంతస్తుల్లో ఉండే రామాలయాన్ని గులాబీ రాతి స్తంభాలతో నిర్మించనున్నారు. అందుకోసం రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా బన్సీ పహాద్‌పూర్ నుంచి 360 స్తంభాలను తరలిస్తున్నారు

news18-telugu
Updated: August 5, 2020, 8:11 AM IST
రామమందిర నిర్మాణం ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో చూడండి
అయోధ్య రామమందిర నమూనా
  • Share this:
అంతా రామమయం.. అందరి నోటా రామనామం.. యావత్ దేశానికి రామమందిర భూమిపూజ శోభ సంతరించుకుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఐతే రామాలయం ఎలా ఉండబోతోంది? ఎన్ని అంతస్తుల్లో నిర్మిస్తారు? దాని ప్రత్యేకత ఏమిటన్న వివరాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నమూనాను విడుదల చేసింది. భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా అద్భుతంగా ఉంది రామ మందిరం.

మూడంతస్తుల్లో ఉండే రామాలయాన్ని గులాబీ రాతి స్తంభాలతో నిర్మించనున్నారు. అందుకోసం రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా బన్సీ పహాద్‌పూర్ నుంచి 360 స్తంభాలను తరలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అయోధ్యకు చేరుకోగా.. మరిన్ని రావాల్సి ఉంది. అంతకు ముందు అనుకున్న దాటికంటే రెట్టింపు ఎత్తులో ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయం ఎత్తు 161 ఫీట్ల ఎత్తులో ఉండనుంది. ఎత్తైన ఈ రామాలయాన్ని అద్భుతమైన ఇండియన్ ఆర్కిటెక్చర్‌తో సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు.

రామమందిర నిర్మాణం ఎలా ఉండనుందో ఈ వీడియోలో చూడండి:


మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జ‌రుగుతుంది. 12.40 గంట‌ల‌కు అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు. రామమందిర భూమి పూజకు మొత్తం 175 మందికి ఆహ్వానం అందింది. వీరిలో 135 మంది సాధువులు, పీఠాధిపతులు ఉన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 8:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading