Ayodhya Ram Temple: ఇది హిందూత్వ విజయం.. ఓవైసీ కామెంట్స్

'బాబ్రీ మసీదు ఉండేది. ఇంకా ఉంది. ఉంటుంది కూడా..' అని ఓవైసీ ట్వీట్ చేశారు. భూవివాదంపై లీగల్ అంశాల ప్రాతిపదికన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. అంతమాత్రాన బాబ్రీ అధ్యాయం ముగిసినట్లు కాదని ఆయన అన్నారు

news18-telugu
Updated: August 5, 2020, 4:51 PM IST
Ayodhya Ram Temple: ఇది హిందూత్వ విజయం.. ఓవైసీ కామెంట్స్
అసదుద్దీన్ ఒవైసీ
  • Share this:
Ayodhya Ram Temple:అయోధ్యలో రామమందిర భూమిపూజను దేశ ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మతాలకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఓవైసీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో భూమి పూజ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీపీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. భూమి పూజ సందర్భంగా ఉద్వేగానికి లోనయినట్లు ప్రధాని మోదీ అన్నారని.. ఐతే తాను కూడా మసీదు విషయంలో ఉద్వేగానికి లోనవుతున్నట్లు ఓవైసీ చెప్పారు. 450 ఏళ్ల పాటు అక్కడ మసీదు ఉండేదని అన్నరు.

ఒక దేశానికి మందిరమో, మసీదో చిహ్నంగా ఉండకూడదు. భారత్ లౌకిక దేశం. రామమందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, ప్రధానమంత్రిగా తాను చేసిన ప్రమాణాన్ని మోదీ ఉల్లంఘించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఓడిపోయిన రోజు ఇది. హిందూత్వం గెలిచిన రోజు.
అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధినేత



అంతకుముందు కూడా ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. 'బాబ్రీ మసీదు ఉండేది. ఇంకా ఉంది. ఉంటుంది కూడా..' అని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. భూవివాదంపై లీగల్ అంశాల ప్రాతిపదికన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. అంతమాత్రాన బాబ్రీ అధ్యాయం ముగిసినట్లు కాదని ఆయన అన్నారు. కనీసం తాను బతికున్నం వరకైనా బాబ్రీ అంశం సజీవంగా ఉంటుందని స్పష్టం చేశారు.

అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. పండితులు సూచించినట్లుగా మధ్యాహ్నం 12.44కి మొదలై... 12.45 సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమి పూజ ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అదే సమయంలో పునాది రాయి వేశారు మోదీ. ముహూర్త సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 40 కేజీల వెండి ఇటుకను పునాదిరాయిగా వేశారు. దాంతో రామాలయ నిర్మాణం ప్రారంభమైనట్లైంది

Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading