Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామజన్మభూమిలో ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం...ఎప్పుడంటే...

ఈ నెల 10 నుంచి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఆలయనిర్మాణ పనులు ఆరంభం కానున్నాయి. ఈ మేరకు రుద్రాభిషేకం చేసి పనులు ప్రారంభం కానున్నట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించింది.

news18-telugu
Updated: June 7, 2020, 7:45 AM IST
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామజన్మభూమిలో ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం...ఎప్పుడంటే...
అయోధ్య రామమందిరం నమూనా (Image: Reuters)
  • Share this:
ఈ నెల 10 నుంచి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఆలయనిర్మాణ పనులు ఆరంభం కానున్నాయి. ఈ మేరకు రుద్రాభిషేకం చేసి పనులు ప్రారంభం కానున్నట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. లంక విజయానికి ముందు శ్రీరాముడు శివారాధన చేశారని. అందుకే ఆలయం నిర్మించే ముందు శివారాధన చేస్తామని ఆయన తెలిపారు. రామ్ జన్మభూమి కాంప్లెక్స్ లోని శశాంక్ శేఖర్ ఆలయంలో జూన్ 10 న రుద్రాభిషేకం తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్మాణానికి పునాది వేసేందుకు ఎల్ అండ్ టి సంస్థ జూన్ 10 న పనులు ప్రారంభిస్తుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

ఆలయ నిర్మాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎల్ అండ్ టి కంపెనీ అధికారులు ఫౌండేషన్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జూన్ 10 న, మహంత్ కమల్ నయన్ దాస్ ఇతర సాధువులతో రుద్రాభిషేక క్రతువును ఉదయం 8:00 గంటలకు ప్రారంభిస్తారని. ఈ ఆరాధన 2 గంటల పాటు జరుగనుంది. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.

శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వారసుడు మహంత్ కమల్ నయన్ దాస్ ప్రకారం, రాముడు లంకను జయించటానికి ముందు రామేశ్వరంలో రుద్రాభిషేకం చేశారని, అందుకే ఆలయ నిర్మాణానికి ముందు శశాంక్ శేఖర్ పూజలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసినట్లు తెలిపారు.
First published: June 7, 2020, 7:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading