ప్రధాని చేతుల మీదుగా రామమందిరం నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడంటే..

గర్భ గుడిలో భూమి పూజతో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఆలయ నిర్మాణానికి ఇది అధికారిక ప్రారంభమైనందున పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారని వెల్లడించాయి.

news18-telugu
Updated: July 17, 2020, 2:53 PM IST
ప్రధాని చేతుల మీదుగా రామమందిరం నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడంటే..
అయోధ్య రామమందిరం నమూనా (Image: Reuters)
  • Share this:
కోట్లాది మంది హిందువుల కల త్వరలో సాకారం కాబోతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం కాబోతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆగస్టు నెలలోనే రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమవనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై.. తన చేతుల మీదుగా నిర్మాణ పనులను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అత్యంత వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిచాలని భావించారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులను ఆహ్వానించి అట్టహాసంగా జరపాలనుకున్నారు. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా తక్కువ మందితో నిర్వహించాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ నిర్ణయించింది.

రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు, యూపీకి చెందిన పలువురు ఎంపీలు మాత్రమే హాజరుకానున్నానట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోదీకి శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానం పంపింది. శనివారం అయోధ్యలో సమావేశమై నిర్మాణ పనుల ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేస్తారు. ఈ సమావేశానికి ఆలయ నిర్మాణ కమిటీకి చైర్మన్‌గా ఉన్న నృపేంద్ర మిశ్రా హాజరవుతారు.

గర్భ గుడిలో భూమి పూజతో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఆలయ నిర్మాణానికి ఇది అధికారిక ప్రారంభమైనందున పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారని వెల్లడించాయి.

కాగా, అయోధ్యలో బాబ్రీ మసీదు, రామజన్మ భూమి వివాదంపై గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదస్పద స్థలం రామ్‌ లల్లాకే చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అటు అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని తీర్పులో పేర్కొంది. తీర్పు వచ్చిన కొన్ని రోజుల తర్వాత కేంద్రం ప్రభుత్వం.. మహంతి నిత్య గోపాల్ దాస్ అధ్యక్షతన 15 మంది సభ్యులతో రామజన్మభూమి తీర్థ కేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ బాధ్యతలను ఆ ట్రస్టే చూస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 17, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading