Ayodhya Ram temple : దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం... స్వప్నం సాకారమైందన్న ప్రధాని మోదీ...

Ayodhya Ram temple Bhumi Puja : రామ జన్మభూమి స్థలంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని... దేశం మొత్తం రామమయం అన్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 1:56 PM IST
Ayodhya Ram temple : దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం... స్వప్నం సాకారమైందన్న ప్రధాని మోదీ...
దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం... స్వప్నం సాకారమైందన్న ప్రధాని మోదీ... (credit - twitter - ANI)
  • Share this:
Ayodhya Ram temple Bhumi Puja : దేశ చరిత్రలో ఇవాళ ఓ సువర్ణాధ్యాయం అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మోదీ ప్రసంగించారు. జై శ్రీరామ్ అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ... కోట్ల మంది హిందువులకు రామాలయ నిర్మాణం అత్యంత ముఖ్యమైనదని అన్నారు. జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయని చెప్పారు. ఇవాళ దేశం మొత్తం రామమయం అయ్యిందన్న మోదీ... వందల ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఫలించిందన్నారు. దశాబ్దాలపాటూ... రామ్‌లల్లా ఆలయం టెంట్‌లోనే కొనసాగిందన్న మోదీ... దేశ ప్రజల సంకల్ప బలంతోనే రామాలయ నిర్మాణం సాధ్యమవుతోందన్నారు.


స్వాతంత్ర్యం కోసం దేశమంతటా పోరాటం జరిగిందన్న ప్రధాని మోదీ... వారి త్యాగాల ఫలితంగానే ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అలాగే రామ మందిరం కోసం కూడా ఎంతో మంది పోరాటం చేశారని తెలిపిన మోదీ... రామ మందిర నిర్మాణం కోసం బలిదానాలు కూడా జరిగాయని వివరించారు. అలాంటి ఎంతో మంది త్యాగం వల్లే ఇవాళ రామాలయ నిర్మాణం జరుగుతోందన్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరపున వారందరికీ వందనం చేస్తున్నానని మోదీ అన్నారు.


హనుమంతుడి ఆశీస్సులతో ఇవాళ రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిందన్నమోదీ... అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. వాళ్ల హృదయం ఆనందంతో నిండిపోయిందన్నారు. రాముడు భారత దేశ మర్యాద అన్న మోదీ... రాముడి కార్యక్రమాలన్నీ హనుమంతుడే చేస్తాడని అన్నారు.


భూమి పూజ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ... ఢిల్లీ నుంచి ఉదయం 10.30కి లక్నో ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. వెంటనే హెలికాప్టర్‌లో అయోధ్యకు బయల్దేరారు. సాకేత్ మహావిద్యాలయం దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. అక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి అయోధ్య రామజన్మ స్థలానికి ఉదయం 11.30 తర్వాత మోదీ చేరుకున్నారు. ఉదయం 11.50కి మోదీ హనుమాన్ గర్హీ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ 10 నిమిషాలు ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత... రామజన్మభూమి కాంప్లెక్స్ చేరుకొని... రామ్ లల్లా విరాజ్‌మాన్‌కి ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం 12.20కి ప్రధాని మోదీ పారిజాత మొక్కను ఆలయ ప్రాంగణంలో నాటారు. తర్వాత ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మోదీ... రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.
Published by: Krishna Kumar N
First published: August 5, 2020, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading