భూమిపూజ వేళ.. శ్రీ రాముడిపై ప్రియాంక గాంధీ స్పెషల్ ట్వీట్

Ayodhya Ram Mandir: భూమి పూజకు అంతా సిద్ధమైన శ్రీరాముడిపై స్పెషల్ ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. అయోధ్య రాముడి సుగుణాలను గుర్తుచేసిన ఆమె.. శ్రీరాముడు అందరివాడని ట్వీట్‌లో పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 4, 2020, 9:48 PM IST
భూమిపూజ వేళ.. శ్రీ రాముడిపై ప్రియాంక గాంధీ స్పెషల్ ట్వీట్
ప్రియాంక గాంధీ(ఫైల్ ఫోటో)
  • Share this:
అంతా రామమయం.. అందరి నోటా రామనామం. అయోధ్యలో రామమందిర భూమి పూజ సందర్భంగా దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. రామజన్మభూమి అయోధ్య అందంగా ముస్తాబైంది. విద్యుత్ వెలుగులు, దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది. భూమి పూజకు అంతా సిద్ధమైన శ్రీరాముడిపై స్పెషల్ ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. అయోధ్య రాముడి సుగుణాలను గుర్తుచేసిన ఆమె.. శ్రీరాముడు అందరివాడని ట్వీట్‌లో పేర్కొన్నారు.శ్రీ రాముడు అందరితోనూ ఉన్నాడు. రామ జన్మభూమిలోని వివాదాస్పద భూమిలో రేపు జరగబోయే భూమిపూజ వేడుక దేశ ఐక్యతకు, సోదరభావానికి, సాంస్కృతిక సమ్మేళనానికి ఓ సందర్భం కానుంది. నిరాడంబరత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధత వీటన్నింటి శ్రీరాముడు ప్రతీకగా నిలుస్తారు.
ప్రియాంక గాంధీబుధవారం జరిగే రామ మందిరం భూమిపూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 50 మంది వీఐపీలు హాజరువుతారని సమాచారం. భూమిపూజకు ముందు మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రధాని మోదీ పూజ చేస్తారు. హనుమాన్‌ గిరి ఆలయంలోని హనుమంతుని పూజలోనూ పాలుపంచుకుంటారు. మొత్తం రూ.326 కోట్ల ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

కోట్లాది మంది కల నెరవేరువుతున్న శుభవేళ.. అన్ని దేశాల రాయబార కార్యాలయాలు స్వీట్లు పంపించనుంది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇందుకోసం 16 లక్షల బికనేర్ లడ్డూలను ఆర్డర్ చేశారు. మొత్త 4 లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డరిచ్చారని.. ఒక్కో ప్యాకెట్‌లో నాలుడు లడ్డూలు ఉంటాయని తెలిసింది. లక్నో, ఢిల్లీలో వీటిని తయారు చేస్తున్నారు. ఆగస్టు 5న భూమి పూజ సందర్భంగా ఢిల్లీలోని అన్ని దేశాల ఎంబసీలతో పాటు అయోధ్యలోనూ స్వీట్లు పంచనున్నారు
Published by: Shiva Kumar Addula
First published: August 4, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading