• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • AYODHYA RAM MANDIR FOUNDATION STONE HAS ALREADY BEEN LAID RAJIV GANDHI JI DID IT SAYS DIGVIJAY SK

అయోధ్యపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు.. భూమిపూజ ఎప్పుడో జరిగింది..

అయోధ్యపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు.. భూమిపూజ ఎప్పుడో జరిగింది..

అయోధ్యపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు.. భూమిపూజ ఎప్పుడో జరిగింది.

రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఎప్పుడో భూమి పూజ జరిగిందని.. రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బాంబు పేల్చారు.

  • Share this:
    అయోధ్యలో రామమందిర భూమి పూజకు అంతా సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఎప్పుడో భూమి పూజ జరిగిందని.. రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగిందని బాంబు పేల్చారు. రామ మందిర నిర్మాణం జరగాలని రాజీవ్ గాంధీ కూడా కోరుకున్నారని ఇటీవల మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్‌ను రిపోర్టులు ప్రశ్నించగా.. రామ మందిర నిర్మాణానికి ఎప్పుడో భూమి పూజల జరిగిందని సంచలనానికి తెరదీశారు.

    ఆగస్టు 5న జరిగే రామ మందిరం భూమిపూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 50 మంది వీఐపీలు హాజరువుతారని సమాచారం. వీఐపీలు, ఆలయ పూజారులు, సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు కలిపి మొత్తం 200 మంది మాత్రమే పాల్గొంటారు. భూమిపూజకు ముందు మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రధాని మోదీ పూజ చేస్తారు. హనుమాన్‌ గిరి ఆలయంలోని హనుమంతుని పూజలోనూ పాలుపంచుకుంటారు. మొత్తం రూ.326 కోట్ల ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

    క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది కల నెరవేరువుతున్న శుభవేళ.. అన్ని దేశాల రాయబార కార్యాలయాలు స్వీట్లు పంపించనుంది. ఇందుకోసం 16 లక్షల బికనేర్ లడ్డూలను ఆర్డర్ చేశారు. మొత్త 4 లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డరిచ్చారని.. ఒక్కో ప్యాకెట్‌లో నాలుడు లడ్డూలు ఉంటాయని తెలిసింది. లక్నో, ఢిల్లీలో వీటిని తయారు చేస్తున్నారు. ఆగస్టు 5న భూమి పూజ సందర్భంగా ఢిల్లీలోని అన్ని దేశాల ఎంబసీలతో పాటు అయోధ్యలోనూ స్వీట్లు పంచనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: