సింగర్‌గా మారిన మాజీ సీఎం.. శ్రీరాముడి భక్తి కీర్తనలతో భజన

అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 2:35 PM IST
సింగర్‌గా మారిన మాజీ సీఎం.. శ్రీరాముడి భక్తి కీర్తనలతో భజన
దేవేంద్ర ఫడ్నవీస్ (Image:ANI)
  • Share this:
దేశమంతటా అయోధ్య శోభ కనిపిస్తోంది. అందరి నోటా శ్రీరాముడి స్మరణే వినిస్తోంది. రామజన్మభూమిలో మందిరం భూమిపూజ కార్యక్రమంగా అంగరంగ వైభవంగా జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భూమి పూజను చేశారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగానూ అందరూ రాముడి పూజలో తరించారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రధాన కార్యాయలంలో భూమి పూజ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సింగర్‌గా మారి పాటలు పాడారు. శ్రీరాముడి కీర్తనలతో భజనలో పాల్గొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. పండితులు సూచించినట్లుగా మధ్యాహ్నం 12.44కి మొదలై... 12.45 సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమి పూజ ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అదే సమయంలో పునాది రాయి వేశారు మోదీ. ముహూర్త సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 40 కేజీల వెండి ఇటుకను పునాదిరాయిగా వేశారు. దాంతో రామాలయ నిర్మాణం ప్రారంభమైనట్లైంది
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading