ప్రధాని మోదీ శ్రీరాముడిని మించిపోయారు... కాంగ్రెస్ నేత ట్వీట్

Ayodhya Ram mandir: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను కర్నాటకలోని చిక్కమాగళూరు ఎంపీ శోభా కరంద్లాజే తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ప్రియమైన రాజును తిరిగి ఇంటికి స్వాగతిండచానికి అయోధ్య సిద్ధంగా అందులో ఉందని పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 4:20 PM IST
ప్రధాని మోదీ శ్రీరాముడిని మించిపోయారు... కాంగ్రెస్ నేత ట్వీట్
Ayodhya Ram mandir: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను కర్నాటకలోని చిక్కమాగళూరు ఎంపీ శోభా కరంద్లాజే తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ప్రియమైన రాజును తిరిగి ఇంటికి స్వాగతిండచానికి అయోధ్య సిద్ధంగా అందులో ఉందని పేర్కొన్నారు.
  • Share this:
దేశమంతటా ఇప్పుడు అయోధ్యపైనే చర్చ జరుగుతోంది. రామజన్మభూమిలో భవ్య మందిరంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్భూ సుందర్.. ప్రధాని మోదీని ఉద్దేశించి వెటకారంగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ శ్రీరాముడి కంటే పెద్దగా ఉన్నారు.. ఇదే కలియుగమో? అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.


బాల రాముడిని చేయి పట్టుకుని అయోధ్య రామమందిరం వైపు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీపుకు విల్లంబులు, చేతిలో బాణంతో ఉన్న బాల రాముడు.. ప్రధాని మోదీ వేలు పట్టుకుని నడుస్తున్నట్లు అందులో ఉంది. ఈ ఫొటోలపై బీజేపీ కార్యకర్తలు ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ ముందు శ్రీరాముడిని చిన్నగా చూపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను కర్నాటకలోని చిక్కమాగళూరు ఎంపీ శోభా కరంద్లాజే తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ప్రియమైన రాజును తిరిగి ఇంటికి స్వాగతిండచానికి అయోధ్య సిద్ధంగా అందులో ఉందని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ శ్రీరాముడి కంటే పెద్దగా ఉన్నాడు. ఏంటో ఈ కలియుగం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. పండితులు సూచించినట్లుగా మధ్యాహ్నం 12.44కి మొదలై... 12.45 సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమి పూజ ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అదే సమయంలో పునాది రాయి వేశారు మోదీ. ముహూర్త సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 40 కేజీల వెండి ఇటుకను పునాదిరాయిగా వేశారు. దాంతో రామాలయ నిర్మాణం ప్రారంభమైనట్లైంది
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading