Video: బాణాసంచా కాల్చిన సీఎం.. దేశమంతటా అయోధ్య సంబరాలు

భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కోట్లాది మంది కల నెరవేరువుతున్న శుభవేళ.. అన్ని దేశాల రాయబార కార్యాలయాలు స్వీట్లు పంపించనుంది రామజన్మభూమి ట్రస్ట్.

news18-telugu
Updated: August 4, 2020, 9:48 PM IST
Video: బాణాసంచా కాల్చిన సీఎం.. దేశమంతటా అయోధ్య సంబరాలు
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపోత్సవంతో అయోధ్య గతమెన్నడూ లేని సరికొత్త శోభను సంతరించుకుంది. ఎక్కడ చూసిన విద్యుత్ వెలుగులు, దీపాల కాంతులతో మెరిసిపోతోంది. రామనామ స్మరణతో అయోధ్యాపురి మార్మోగిపోతోంది. అయోధ్యలోనే కాదు.. భూమి పూజ వేళ దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. ఇక దిపోత్సవంలో భాగంగా లక్నోలోని సీఎం కార్యాలయంలోనూ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాణాసంచా కాల్చారు.


ప్రధాని మోదీ చేతుల మీదుగా బుధవారం భూమి పూజ కార్యక్రమం జరగనుంది. 3 గంటల పాటు అయోధ్యలో గడపనున్నారు. బుధవారం ఉద‌యం 9.35 గంట‌లకు ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి బయలుదేరుతారు. ఉదయం 10.35 గంటలకు యూపీలోని లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అయోధ్యకు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. ఉదయం 11.40 గంటలకు సీఎం యోగితో కలిసి హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకుంటారు ప్రధాని మోదీ. మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమికి చేరుకొని.. రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు 10 నిమిషాల పాటు పూజలు చేస్తారు. ఆ తర్వాత అక్కడ పారిజాత మొక్కను నాటుతారు ప్రధాని. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు భూమి పూజ జ‌రుగుతుంది. 12.40 గంట‌ల‌కు అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు.

భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కోట్లాది మంది కల నెరవేరువుతున్న శుభవేళ.. అన్ని దేశాల రాయబార కార్యాలయాలు స్వీట్లు పంపించనుంది రామజన్మభూమి ట్రస్ట్. ఇందుకోసం 16 లక్షల బికనేర్ లడ్డూలను ఆర్డర్ చేశారు. మొత్త 4 లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డరిచ్చారని.. ఒక్కో ప్యాకెట్‌లో నాలుడు లడ్డూలు ఉంటాయని తెలిసింది. లక్నో, ఢిల్లీలో వీటిని తయారు చేస్తున్నారు. ఆగస్టు 5న భూమి పూజ సందర్భంగా ఢిల్లీలోని అన్ని దేశాల ఎంబసీలతో పాటు అయోధ్యలోనూ స్వీట్లు పంచనున్నారు
Published by: Shiva Kumar Addula
First published: August 4, 2020, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading