AYODHYA LAND DISPUTE CASE SC TO BEGIN REGULAR HEARINGS FROM JULY 25 IF MEDIATION FAILS BA
Ayodhya Land dispute Case: మధ్యవర్తిత్వం విఫలమైతే.. మళ్లీ రంగంలోకి సుప్రీం
సుప్రీంకోర్టు (File)
అయోధ్య కేసులో పరిష్కారం కోసం మార్చి 8న ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈనెల 18లోపు ఆ కమిటీని నివేదిక ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది.
అయోధ్య రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నియమించిన మధ్యవర్తిత్వం విఫలమైతే.. మళ్లీ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోనుంది. ఒకవేళ మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే.. జూలై 25 నుంచి పిటిషన్పై విచారణ జరపనుంది. ఈనెల 18 లోపు త్రిసభ్య కమిటీని తన నివేదికను సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. మధ్యవర్తిత్వం ద్వారా అయోధ్య సమస్య పరిష్కారం కాదని.. కాబట్టి అది ముగిసిన అధ్యాయంగా భావించి కేసును సుప్రీంకోర్టు యధావిధిగా విచారించాలంటూ రాజేంద్ర సింగ్ విశారద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ.. ‘ జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈనెల 18లోపు తమ నివేదికను అందించాలి. ఒకవేళ కమిటీ ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తీసుకురాలేకపోతే జూలై 25 నుంచి సుప్రీంకోర్టు.. అయోధ్య కేసును విచారిస్తుంది.’ అని స్పష్టం చేశారు.
అయోధ్య కేసులో పరిష్కారం కోసం మార్చి 8న ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మొహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు ఆ కమిటీలో సభ్యులు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.