అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు... సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను నియమించింది. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, లాయర్ శ్రీరామ్ పంచు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఖలీపుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. ఈ మధ్యవర్తిత్వ కమిటీ సీల్డ్ కవర్‌లో తమ తాత్కాలిక నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం కావడంతో... నివేదికలో అంశాలు బహిర్గతం కాలేదు. ఈ నెల 6న సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఈ తాత్కాలిక నివేదిక నమోదైంది. నాలుగు రోజుల కిందటే రిపోర్టు వచ్చినా... ఇతర కేసుల వల్ల సుప్రీంకోర్టు ఇవాళ సమీక్ష జరపాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు విచారణ ఎలా సాగుతుంది, నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది.
అయోధ్య వివాదాన్ని సామరస్య పూర్వక రీతిలో పరిష్కరించేందుకు గల అవకాశాలను నిర్ధారించేందుకు మార్చి 8న త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్.ఏ. బాబ్డే, డీ.వై.చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్. అబ్దుల్ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది.
మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచాలనీ, దాన్ని ఎలా చెయ్యాలనుకుంటున్నారో రిపోర్ట్ ఇవ్వమని మధ్యవర్తులకు 8 వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. మధ్యవర్తిత్వం చేస్తున్న ప్యానెల్ సభ్యులు ఈ మధ్య కాలంలో అయోధ్యలో వివాదాస్పద భూమిని చాలాసార్లు చూసి వచ్చారు. కమిటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మే3తో ముగిసింది. వాళ్లు తమ నివేదికలో ఏం తేల్చారన్నదానిపై సుప్రీంకోర్టు విచారించబోతోంది. మరి ఈ సభ్యులు వివాదాన్ని పరిష్కరించే దిశగా ఏమైనా సూచనలు, ప్రతిపాదనలూ చేశారా, మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫలించే అవకాశం ఉందా అన్నది ఇవాళ తేలనుంది.
ఇవి కూడా చదవండి :
నేడు తెలంగాణలో రెండో దశ పరిషత్ ఎన్నికలు... బరిలో 6,951 మంది అభ్యర్థులు...
జగన్ అనే నేను... రెడీ అవుతున్న వైసీపీ... 19న నేతలతో జగన్ కీలక సమావేశం...
ఏపీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ... టీడీపీ నేత చేయించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు...
వైసీపీ గెలిస్తే, వాళ్లందరికీ జగన్ చుక్కలు చూపిస్తారా...? రెడీ అవుతున్న లిస్ట్...?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Ram Mandir, Supreme Court