Ayodhya Case: అయోధ్యలో సయోధ్యకు ‘మధ్యవర్తిత్వం’... సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Ayodhya issue: అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ప్యానెల్ ఛైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ ఖలీపుల్లాను నియమించిన సుప్రీంకోర్టు... ప్యానెల్‌లో సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది.

news18-telugu
Updated: March 8, 2019, 12:18 PM IST
Ayodhya Case: అయోధ్యలో సయోధ్యకు ‘మధ్యవర్తిత్వం’... సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 8, 2019, 12:18 PM IST
అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ప్యానెల్ ఛైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ ఖలీపుల్లాను నియమించిన సుప్రీంకోర్టు... ప్యానెల్‌లో సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ 4 వారాల్లోగా ప్రారంభించి 8 వారాల్లో పూర్తి చేయాలని ప్యానెల్‌కు సూచించింది. ఈ నివేదికను గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రెండు దశాబ్దులుగా కొనసాగుతున్న రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి గత వారం నుంచి చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు... వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏం జరిగింది... ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనే అంశానికి తాము ప్రాధాన్యత ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు మధ్యవర్తిత్వ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న రవిశంకర్ ట్విట్టర్‌లో స్పందించారు.





అందరి మనోభావాలను గౌరవిస్తూ, సామరాస్యాన్ని కాపాడుతూ, వివాదాలకు ముగింపు పలికి అంతా సంతోషంగా ఉండాలని రవిశంకర్ ట్విట్ చేశారు.
First published: March 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...