అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ప్యానెల్ ఛైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ ఖలీపుల్లాను నియమించిన సుప్రీంకోర్టు... ప్యానెల్లో సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ 4 వారాల్లోగా ప్రారంభించి 8 వారాల్లో పూర్తి చేయాలని ప్యానెల్‌కు సూచించింది. ఈ నివేదికను గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రెండు దశాబ్దులుగా కొనసాగుతున్న రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి గత వారం నుంచి చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు... వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏం జరిగింది... ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనే అంశానికి తాము ప్రాధాన్యత ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు మధ్యవర్తిత్వ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న రవిశంకర్ ట్విట్టర్లో స్పందించారు.
Respecting everyone, turning dreams to reality, ending long-standing conflicts happily and maintaining harmony in society - we must all move together towards these goals.#ayodhyamediation
— Sri Sri Ravi Shankar (@SriSri) March 8, 2019
అందరి మనోభావాలను గౌరవిస్తూ, సామరాస్యాన్ని కాపాడుతూ, వివాదాలకు ముగింపు పలికి అంతా సంతోషంగా ఉండాలని రవిశంకర్ ట్విట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Ram Mandir, Supreme Court