అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించవచ్చా..? లేదా..? అన్న దానిపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. మధ్యవర్తి ద్వారా వివాదాన్ని పరిష్కరించడానికి కేవలం ఒక్క శాతం అవకాశం ఉన్నా సరే.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని గతంలో కోర్టు తెలిపింది. అవసరమైతే మధ్యవర్తిని కూడా న్యాయస్థానమే నియమిస్తుందని పేర్కొంది.
అయితే మధ్యవర్తిత్వంపై ఇరు వర్గాల నుంచి సమ్మతి లభిస్తేనే ఇది ముందుకు కదిలే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే రామ్‌లల్లా సంస్థ దీన్ని వ్యతిరేకిస్తోంది. మరోవైపు కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం ఈ ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం కేసును విచారించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.