ఆఖరి నిమిషంలో ఆగిన ఆయోధ్య కేసు విచారణ.. ఎందుకంటే..

Ayodhya dispute: కేసు విచారణకు ఐదుగురు జడ్జిలు హాజరు కావాల్సి ఉన్నందున.. అందులో ఒకరైన జస్టిస్ ఎస్‌ఏ బోబ్డ్ హాజరు కాలేదు. దీంతో మరికొన్ని నిమిషాల్లో కేసు విచారణ ప్రారంభం అవుతుందనగా.. న్యాయస్థాన సిబ్బంది ఇరు వర్గాల లాయర్లకు సమాచారమిచ్చి, నేటి కేసు విచారణ జరగడం లేదని తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 19, 2019, 1:00 PM IST
ఆఖరి నిమిషంలో ఆగిన ఆయోధ్య కేసు విచారణ.. ఎందుకంటే..
సుప్రీంకోర్టు
  • Share this:
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేత‌ృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచి విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కూడా కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే, కేవలం కొన్ని నిమిషాల ముందు కేసు విచారణ జరగడం లేదని లాయర్లకు సమాచారం అందింది. కేసు విచారణకు ఐదుగురు జడ్జిలు హాజరు కావాల్సి ఉన్నందున.. అందులో ఒకరైన జస్టిస్ ఎస్‌ఏ బోబ్డ్ హాజరు కాలేదు. దీంతో మరికొన్ని నిమిషాల్లో కేసు విచారణ ప్రారంభం అవుతుందనగా.. న్యాయస్థాన సిబ్బంది ఇరు వర్గాల లాయర్లకు సమాచారమిచ్చి, నేటి కేసు విచారణ జరగడం లేదని తెలిపారు. ఐదుగురు సభ్యుల బెంచిలో గొగోయ్, బోబ్డ్ సహా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏస్‌ఏ నజీర్ ఉన్నారు.

కాగా, గత శుక్రవారం నాటి విచారణలో సీనియర్ లాయర్ సీఎస్ వైద్యనాథన్ వాదిస్తూ.. ఆ వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించేకంటే ముందే అతి పెద్ద రాముడి ఆలయం ఉండేదని, దాన్ని రెండో శతాబ్ధం కంటే ముందే అక్కడ నిర్మించారని కోర్టుకు వివరించారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>