Ayodhya Verdict : దేశవ్యాప్తంగా హైఅలర్ట్... అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పేంటి?

Ayodhya Verdict 2019 : అయోధ్య కేసుపై ఇవాళ 10.30కి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుండటంతో... దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. అలాగే... తీర్పు చెప్పే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు భద్రతను పెంచారు.

news18-telugu
Updated: November 9, 2019, 6:25 AM IST
Ayodhya Verdict : దేశవ్యాప్తంగా హైఅలర్ట్... అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పేంటి?
అయోధ్య వివాదంపై న్యూస్‌18 క్రియేటివ్
  • Share this:
Ayodhya Verdict 2019 : ఎన్నో ఏళ్లుగా ఎటూ తేలకుండా ఉన్న అయోధ్య కేసుపై ఇవాళ ఫైనల్ తీర్పు రాబోతోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నేడు ఉదయం 10.30కు ఫైనల్ తీర్పు ఇవ్వబోతోంది. తీర్పు ఎలా ఉన్నా అందరూ సంయమనం పాటించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. అదే క్రమంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆ ఒక్క రాష్ట్రానికే 4వేల పారా మిలిటరీ దళాల్ని తరలించారు. అలాగే... 30 బాంబు స్క్వాడ్ బృందాలు కూడా వెళ్లాయి. ఎందుకైనా మంచిదని ఉత్తరప్రదేశ్‌లో స్కూళ్లకు మూడు రోజులు (సోమవారం వరకు) సెలవులు కూడా ఇచ్చారు. అలాగే... తీర్పు చెప్పే ఐదుగురు న్యాయమూర్తులకూ భద్రతను భారీగా పెంచారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి Z కేటగిరీ భద్రత కల్పించారు. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను పెంచాలని కేంద్రం ఆదేశించింది. చాలా రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది.

తీర్పు రావాలని దేశమంతా కోరుకుంటోంది. అదే సమయంలో... ఎలాంటి తీర్పు వస్తుందో, తద్వారా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న టెన్షన్ కూడా అన్ని రాష్ట్రాల పాలకులకూ ఉంది. అందుకే ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిథ్యనాథ్, ఆర్ఎస్ఎస్ నాయకులు... అందరూ ప్రజలను శాంతియుతంగా ఉండాలనీ, సంయమనం పాటించాలనీ కోరుతున్నారు. ఎలాంటి తీర్పు వచ్చినా అది ఎవరి విజయమూ, అపజయమూ కాదనీ, అయోధ్య వివాదానికి ఓ పరిష్కారంగా తీర్పును భావించాలే తప్ప... మరో విధంగా భావించవద్దని మరీ మరీ కోరుతున్నారు. ఈ తీర్పుపై ఎవరూ, ఏ వేడుకలూ జరుపుకోవద్దని కోరారు.

అయోధ్య కేసుపై నిర్మోహీ అఖాడా, రామ్ లల్లా విరాజమాన్, సున్నీ వక్ఫ్ బోర్డ్... పిటిషనర్లుగా ఉన్నాయి. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వబోతోంది. జస్టిస్ రంజన్ గొగోయ్... ఈ నెల 17న రిటైర్ కాబోతున్నారు. అందువల్లే ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. ఈ తీర్పు వచ్చాక... సోషల్ మీడియాలో ఎవరూ తప్పుడు రాతలు రాయనివ్వకుండా... యూపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. సోషల్ మీడియాపై కన్నేసి ఉంచేందుకు ఏకంగా 16వేల మంది వాలంటీర్లు రంగంలోకి దిగారు. ఎవరైనా పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినా, ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టినా... వారిపై కేసులు నమోదు చేస్తారు. ఆ తర్వాత శిక్షలు కూడా తప్పవు. అందువల్ల అయోధ్య తీర్పుపై శాంతియుతంగా ఉండాలని అందరూ కోరుతున్నారు.

 


Pics : చందనపు బొమ్మ సంజన క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదవండి :RTC Strike : నేడు ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్...

సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...

First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>