హోమ్ /వార్తలు /జాతీయం /

అయోధ్య రాముడి వారసులు ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా?

అయోధ్య రాముడి వారసులు ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ayodhya Rama : ఒక్కోసారి కోర్టులు వేసే ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఓ ఆసక్తికర ప్రశ్నను సుప్రీంకోర్టు అడగడం చర్చనీయాంశమే.

అయోధ్య రామ జన్మభూమి వివాదానికి సంబంధించి... సుప్రీంకోర్టులో రోజువారీ విచారణలో ఎవరూ ఊహించని ప్రశ్నలు వేస్తోంది. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు కూడా సీరియస్‌గా అడుగుతుంటే... ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి లాయర్లకు తలెత్తుతోంది. శుక్రవారం అదే జరిగింది. ఓ సరికొత్త ప్రశ్న వేసింది అత్యున్నత న్యాయస్థానం. అదేంటంటే... "శ్రీరాముడి వారసులు ఇంకా అయోధ్యలో ఉన్నారా?" అని రామ్‌లల్లా విరాజ్ మాన్ అనే సంస్థ తరపున వాదిస్తున్న లాయర్‌ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బెంచ్... లాయర్ పరాశరణ్‌కు ఆ ప్రశ్న వేసింది. రఘు వంశానికి చెందిన వారసులు ఇప్పటికీ అయోధ్యలో నివసిస్తున్నారా? అన్నది తెలుసుకోవాలని మాకు అనిపిస్తోంది. ఇది మాకు ఆసక్తి కలిగిస్తోంది అని బెంచ్ ఆయన్ను అడిగింది. సమాధానం ఇచ్చేందుకు ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేదన్న ధర్మాసనం... జస్ట్ ఆసక్తి కొద్దీ అడుగుతున్నట్లు తెలిపింది.


శ్రీరాముడి వారసులు ఇప్పుడు అయోధ్యలో ఉన్నారో లేదో తన దగ్గర సమాచారం లేదన్నారు పరాశరణ్. సమాధానం తెలుసుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తాను అని ఆయన తెలిపారు. హిందువులు... దేవుళ్లను ఓ స్పష్టమైన ఆకారంలో పూజించరనీ, అవతార పురుషులుగానే వాళ్లను ఆరాధిస్తారని పరాశరణ్ ధర్మాసనానికి వివరించారు. అక్కడితో వదిలెయ్యలేదు. తన వాదనకు బలం చేకూరుస్తూ... కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రస్తావించారు. అక్కడ ఏ దేవత విగ్రహమూ ఉండదని తెలిపారు. అందువల్ల ఓ ప్రాంతాన్ని ఆలయంగా భావించడానికి అక్కడ కచ్చితంగా విగ్రహం ఉండి తీరాలన్న అవసరం లేదని పరాశరణ్ అభిప్రాయపడ్డారు.


ఇంతకీ పరాశరణ్ చెప్పదలచుకున్నది ఏంటంటే... అయోధ్యలో రాముడి విగ్రహాన్ని పెట్టక ముందునుంచే, ఆలయాన్ని నిర్మించక ముందునుంచే... అక్కడి హిందువులు రాముణ్ని పూజిస్తూ వచ్చారని తెలిపారు. అందువల్ల అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నది ఆయన అభిప్రాయం. స్వయంగా సుప్రీంకోర్టే ఇలాంటి ప్రశ్న అడిగేసరికి... దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయోధ్య రామ జన్మ భూమి వివాదంపై నాలుగు రోజులుగా... డైలీ విచారణ సాగుతోంది. ఇంకా ఇలాంటి ఏయే ప్రశ్నలు బెంచ్ సంధిస్తుందో... అవి ఎలాంటి చర్చకు దారితీస్తాయో.

First published:

Tags: Ayodhya Ram Mandir, Lord rama, Supreme Court

ఉత్తమ కథలు