Home /News /national /

AYODHYA CASE ROW JUSTICE LALITH DECIDED TO STAY AWAY FROM JUDGE PANEL IN SUPREME COURT

అయోధ్య కేసులో ట్విస్ట్... సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో)

సుప్రీంకోర్టు (ఫైల్ ఫోటో)

అయోధ్య కేసు విచారణ చేపట్టనున్న ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. ఆయన గతంలో అయోధ్య కేసుకు సంబంధించి యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ తరపున వాదనలు వినిపించారు.

    అయోధ్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్ లలిత ఈ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. గతంలో అయోధ్య కేసుకు సంబంధించి కళ్యాణ్ సింగ్ తరపున లలిత్ వాదనలు వినిపించారు. దీనిపైనే రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయోధ్య కేసు విచారణకు సంబంధించి తేదీలు, షెడ్యూల్ ఖరారు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలో విచారణ మొదలుపెట్టిన సుప్రీంకోర్టు... ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయోధ్య కేసు విచారణ చేపట్టే ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో... కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది.

    అయోధ్య కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా కావాలని దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ అంశంలో న్యాయప్రక్రియ పూర్తయిన తరువాతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ సైతం వ్యాఖ్యానించడంతో... కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కేసును విచారించే ధర్మాసనం నుంచి న్యాయమూర్తి లలిత్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.



    First published:

    Tags: Ayodhya Ram Mandir, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు