అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ ప్రారంభమయ్యింది. అయోధ్య కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే ఆలోచనలో అత్యున్నత న్యాయస్థానం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సభ్యులత కూడిన ధర్మాసనం వాదనలు వింటుంది. అయితే మధ్యవర్తిత్వాన్ని హిందూ మహాసభ వ్యతిరేకిస్తుంది. రామ జన్మభూమి మా ఆస్తి అంటూ హిందూ మహా సభ పేర్కొంది. దీంతో మధ్య వర్తిత్వం ఫలించదని హిందూ మహా సభ నేతలు చెబుతున్నారు. మరోవైపు కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు జస్టీస్ బాబ్డే రామ జన్మ భూమి ప్రాపర్టీ కాదన్నారు. రామజన్మభూమి విశ్వాసం, సెంటిమెంట్‌కు సంబంధించిన అంశమని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001ల అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Ram Mandir, Supreme Court