Home /News /national /

AYODHYA 3 MEMBER MEDIATION PANEL SUBMITS REPORT IN SEALED COVER TO SC BA

Ayodhya Case | అయోధ్యపై సుప్రీంకు సీల్డ్ కవర్ నివేదిక ఇచ్చిన మధ్యవర్తుల కమిటీ

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

అయోధ్య రామజన్మభూమి వివాదం పరిష్కారం కోసం గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

    అయోధ్య రామజన్మభూమి వివాదంపై గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీ తమ నివేదికను అందజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా నియమించిన కమిటీ తమ రిపోర్టును సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు గతంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ.. ఇరువర్గాల తరఫున మధ్యవర్తిత్వం వహించి కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేలా ప్రయత్నించడానికి ఆస్కారం కల్పించింది. ఈ కమిటీకి తొలుత జూలై 25 విధించింది. అయితే, ఆ తర్వాత మరికొన్ని రోజులు గడువు పొడిగించింది. ఈ త్రిసభ్య కమిటీ మధ్యవర్తిత్వం ఫలించిందా? లేదా? అనేది సుప్రీంకోర్టు చెప్పనుంది. ఒకవేళ మధ్యవర్తిత్వం విఫలమైతే తాము మళ్లీ జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ayodhya Ram Mandir, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు