AVOID SHARING AADHAAR SHARE ONLY MASKED VERSION GOVT ADVISORY PVN
Aadhaar: ఆధార్ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం..వెంటనే వెనక్కి
ప్రతీకాత్మక చిత్రం
Aadhaar masked version : దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసింది.
Aadhaar masked version : దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసింది. . ఏ సంస్థకైనా, ఎవ్వరికైనా ఫొటోకాపీ ఆధార్ ను ఇవ్వకూడదని, అది దుర్వినియోగం అయ్యే ఛాన్స్ వుందని కేంద్రం హెచ్చరించింది. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే ఫొటోకాపీకి బదులుగా మాస్క్డ్ (Masked Aadhaar Card)కాపీలను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే, ముందస్తు జాగ్రత్తల కోసమే ఈ సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో కోరింది. మాస్క్డ్ కాపీలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయని, దీని ద్వారా ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే మాస్క్డ్ ఆధార్ ను మాత్రమే ఇతరులతో పంచుకోవాలన్న ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో విడుదల చేసిన ప్రకటన ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున దానిని వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రజలు గతంలో మాదిరిగానే ఆధార్ ను వినియోగించుకోవాలని సూచించింది కేంద్రం.
మాస్క్డ్ ఆధార్ కాపీ అంటే ఏంటి
భారత పౌరుల సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్లైన్లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనినే మాస్క్ ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. దీంతో, మాస్క్డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది.
మాస్క్డ్ ఆధార్‌ను ఇలా డౌన్లోడ్
https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, 'డౌన్లోడ్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మాస్క్డ్ ఆధార్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ధృవీకరణ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయాలి. ఈ-ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత PDF కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.