Kerala: రాత్రికి రాత్రి పాపులరైన ఆటో డ్రైవర్.. కేవలం ఒకే ఒక్క ట్వీట్‌తో..

ఆటో డ్రైవర్ ప్రదీప్

ప్రదీప్​కు చిన్నతనం నుంచే పుస్తకాలు, నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అనేక మంది ప్రసిద్ద రచయితలు రాసిన పుస్తకాలన్నీ చదివేశాడు. అయితే వాటన్నింటిలో కెల్లా ది ఆల్కెమిస్ట్​ నవల ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

  • Share this:
బైక్​లు, ఆటోలు, కార్ల వెనుక తమకు నచ్చిన కొటేషన్, పేర్లు ప్రింట్​ చేయిస్తుంటారు చాలా మంది. కొందరైతే వారి అభిమాన నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల పేర్లు, ఫోటోలను ప్రింట్ వేయిస్తుంటారు. అయితే కేరళలో ఒక ఆటో వాలా మాత్రం అందరికీ భిన్నంగా ఓ పేరు తన ఆటో వెనుక రాయించాడు. ఆ పేరు ఎవరో ప్రముఖ నటుడు అనుకుంటే పొరబడినట్లే..! ప్రముఖ రచయిత, ప్రపంచవ్యాప్తంగా పుస్తక ప్రియులకు పరిచయం అక్కర్లేని ‘ది ఆల్కెమిస్ట్’​ నవలా రచయిత పాలో కొయెల్హో పేరును ఆటో వెనుక రాయించాడు.

బ్రెజిల్​​కు చెందిన పాలో కొయెల్హో రాసిన ‘ది ఆల్కెమిస్ట్​’ నవల ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది. కేరళలోని చెరాయ్​కి చెందిన 55 ఏళ్ల ఆటో డ్రైవర్​ ప్రదీప్​ కూడా ఈ​ నవల చదివి పాలో కొయెల్హోకి అభిమానిగా మారాడు. ప్రదీప్​కు చిన్నతనం నుంచే పుస్తకాలు, నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అనేక మంది ప్రసిద్ద రచయితలు రాసిన పుస్తకాలన్నీ చదివేశాడు. అయితే వాటన్నింటిలో కెల్లా ది ఆల్కెమిస్ట్​ నవల ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

అందుకే తన అభిమానానికి గుర్తుగా తన ఆటో వెనుక ఆల్కెమిస్ట్​ నవల పేరుని మళయాలంలో, పాలో కొయెల్హో పేరును ఇంగ్లీష్​లో రాయించాడు. అంతేకాదు, తన ఆటో ముందు భాగంలో ఆల్కెమిస్ట్​ అని ఇంగ్లీష్​లో పెయింటింగ్​ వేయించాడు. ఇప్పుడు కేరళలో ఈ ఆటో హాట్​ టాపిక్​గా మారింది. ఈ ఆటోను చూసి కొంతమంది ప్రయాణికులు సోషల్​మీడియాలో దాని ఫోటోలు షేర్​ చేశారు. ఇది కాస్త సోషల్​ మీడియా ద్వారా ఎక్కడో బ్రెజిల్​లో ఉన్న పాలో కొయెల్హోకి చేరింది.

BJP: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ ప్లాన్.. రంగంలోకి ముఖ్యనేతలు.. కొంతవరకు సక్సెస్ సాధించిందా ?

Heart Attack: గుండెపోటు ఎక్కువగా వచ్చేది ఈ రోజే.. అధ్యయనంలో వెల్లడి.. కారణం ఏంటంటే..

కృతజ్ఞతలు చెబుతూ పాలోకోయిలో ట్వీట్​..
ఆటో వాలా ప్రదీప్​ అభిమానానికి మంద్రముగ్థుడైన పాలోకోయిలో ట్విట్టర్​ ద్వారా అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆటో ఫోటో షేర్​ చేస్తూ ‘‘మీ అభిమానానికి ధన్యవాదాలు” అని రాసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పాలో కొయెల్హో ట్విట్టర్​ అకౌంట్‌లో ప్రదీప్​ ఆటో ఫోటోలు కనిపించడంతో ఒక్కసారిగా అతనికి పాపులారిటీ వచ్చేసింది. స్థానిక మీడియాలో ఇప్పుడు ఆటోవాలా ప్రదీప్​ పేరు మార్మోగిపోతోంది. అభిమాన రచయిత తన ఆటో ఫోటో షేర్​ చేయడం పట్ల ప్రదీప్​ ఆనందం వ్యక్తం చేశాడు. ఏదో ఒకరోజు తప్పకుండా బ్రెజిల్​ వెళ్లి కోయిలోను కలుస్తానని ప్రదీప్​ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Published by:Kishore Akkaladevi
First published: