కేరళలో ఘోరం.. పేలుడు పదార్థం తినడంతో మరో ఏనుగు మృతి

అటవీ ప్రాంతంలో అధికారులు ఏప్రిల్‌లో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును గుర్తించారు. ఆ ఏనుగుకు వైద్యం చేసేందుకు అధికారులు ప్రయత్నించారు.

news18-telugu
Updated: June 4, 2020, 11:23 AM IST
కేరళలో ఘోరం.. పేలుడు పదార్థం తినడంతో మరో ఏనుగు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేరళ సైలెంట్ వ్యాలీలో ఫైనాఫిల్‌లో పేలుడు పదార్థం పెట్టి తిన్పించడంతో గర్భంతో ఉన్న ఏనుగు నదిలో నిలబడి చనిపోయిన హృదయ విదారక ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన ఘటనపై దేశవ్యాప్తంగా అగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలోనే అలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో అధికారులు ఏప్రిల్‌లో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును గుర్తించారు. ఆ ఏనుగుకు వైద్యం చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినా ఆ ఏనుగు సహకరించకుండ కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లింది. మరుసటి రోజే ఓ చోట ఆ ఏనుగు చనిపోయిందని తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఏనుగు దవడ విరిగినట్టు గుర్తించారు. దీంతో.. ఆడ ఏనుగు సైతం ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే చనిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టమ్‌కు సంబంధించిన రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్టు అధికారులు తెలిపారు.
First published: June 4, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading