ఔరంగాబాద్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా...

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో చనిపోయిన 17 మంది కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

news18-telugu
Updated: May 8, 2020, 3:39 PM IST
ఔరంగాబాద్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా...
ఔరంగాబాద్ రైలు ప్రమాదం ఫొటో
  • Share this:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో చనిపోయిన 17 మంది కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను మహారాష్ట్ర సీఎం ఆఫీసు ప్రకటించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఔరంగాబాద్ రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వారికి వీలైనంత సాయం చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులు రాత్రిపూట రైలుపట్టాల మీద పడుకుని ఉండగా, గూడ్స్ ట్రైన్ వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు చనిపోయారు. ఛత్తీస్‌గఢ్‌కు పయనమైన వలస కూలీలు (మధ్యప్రదేశ్ లో పనిచేస్తున్నారు) గురువారం రాత్రి ఔరంగాబాద్‌కు చేరుకున్నారు. రాత్రి కావడంతో రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు. అయితే, ఓ గూడ్స్ రైలు వచ్చే విషయం తెలీక గాఢ నిద్రలోనే ఉండిపోయారు. అంతే.. ఆ రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఆ రైలు చక్రాల కింద నలిగి 17 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఔరంగాబాద్‌కు సమీపంలోని కర్మాద్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
First published: May 8, 2020, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading