హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Crime: దారుణం..నమ్మించి తీసుకెళ్లి మహిళల నరబలి..అష్టైశ్వర్యాలతో తులతూగాలని దంపతుల ఘాతుకం

Crime: దారుణం..నమ్మించి తీసుకెళ్లి మహిళల నరబలి..అష్టైశ్వర్యాలతో తులతూగాలని దంపతుల ఘాతుకం

ప్రస్తుత రోజుల్లో మూఢనమ్మకాలను ప్రజలు నమ్మడం లేదు. యంత్రాలు, తంత్రాలు, మంత్రాలను కాకుండా టెక్నాలజీని నమ్ముతున్నారు. కానీ కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను ఇంకా గుడ్డిగా నమ్ముతూ నిండు జీవితాలను బలి ఇస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

ప్రస్తుత రోజుల్లో మూఢనమ్మకాలను ప్రజలు నమ్మడం లేదు. యంత్రాలు, తంత్రాలు, మంత్రాలను కాకుండా టెక్నాలజీని నమ్ముతున్నారు. కానీ కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను ఇంకా గుడ్డిగా నమ్ముతూ నిండు జీవితాలను బలి ఇస్తున్నారు. వీరికి మూఢనమ్మకాలపై ఎంతటి అవగాహన కల్పించిన కానీ ఫలితం లేకుండా పోతుంది.ఈ మూఢనమ్మకాలను ప్రజలు గుడ్డిగా నమ్ముతూ వింత ఆచారాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇటీవల మూఢనమ్మకాల నమ్మి వింత ఆచారాన్ని పాటిస్తున్నారు తమిళనాడు ప్రాంత ప్రజలు. మరుగుతున్న నెయ్యిని ఒళ్ళంతా పూసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు. ఈ విచిత్ర ఆచారాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

ఇక తాజాగా కేరళ రాష్ట్రంలో ఈ మూఢనమ్మకాలను విశ్వసించి ఇద్దరు అమాయకమైన మహిళల జీవితాలను బలిగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను తిరువళ్లకు తీసుకొచ్చి మంత్రతంత్రాలతో బలి ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ దారుణ ఘటనలో భాగ్యస్వామ్యమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని పోలీసులు ఈ మేరకు తెలియజేసారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఏజెంట్, దంపతులను కూడా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. వీరిని భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు రషీద్ భగవాల్ సింగ్, లైలా అనే దంపతులను నమ్మించి ఇద్దరు మహిళలను బలిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తుయని మాటలతో నమ్మించాడు.

ఈ ఇద్దరు మహిళలు జీవనోపాధి కోసం లాటరీ టికెట్లు అమ్ముకునే వారని పోలీసులు తెలిపారు. అందులో ఒక మహిళ అయిన రోసిలి జూన్ లో కనిపించకుండా పోయింది. దీనితో ఆమె కూతురు ఆగష్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మిగిలిన మరో మహిళా పద్మము మిస్సింగ్ కాగా ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న కడవంతర పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఓ ఏజెంట్ మహిళలను తీసుకురావడంలో సహాయం చేశారు. ఫేస్ బుక్ నకిలీ ఖాతా ద్వారా భగవత్ ను కలిసేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పెరుంబరుకు చెందిన వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి జరుగుతుందని నమ్మించి తీసుకెళ్లారు. తమ పథకంలో భాగంగా దంపతులు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పలు రకాల్లో విచారణ చేయగా నరబలి విషయం బయటకు వచ్చింది. వారిని బలి ఇచ్చిన తరువాత ఇద్దరి మృతదేహాలను ఖననం చేశారని తెలుస్తుంది. దీనితో పోలీసులు ఒకరి మృతదేహాన్ని లభ్యం చేసుకున్నారు. అయితే అక్షరాస్యత ఎక్కువ గల కేరళలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

First published:

Tags: Crime news, Kerala

ఉత్తమ కథలు