Home /News /national /

ATM FOR PRISONERS TO WITHDRAW CASH IN CENTRAL JAIL OF PURNIA IN BIHAR SOON AK GH

ATM in Jail: ఈ జైలులో త్వరలోనే ATM.. ఖైదీల కోసమే ప్రత్యేకం.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ATM in Jail: కారాగారం పరిసరాల్లో పనిచేసినందుకు గాను ఖైదీలకు రోజులు నాలుగు గంటలకు రూ.52, ఎనిమిది గంటలకు రూ. 103లను వేతనంగా ఇస్తారు.

డబ్బు అవసరమైతే వెంటనే ATMకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. మరి జైలులో ఖైదీలకు డబ్బు అవసరమైతే పరిస్థితి ఏంటి? వారికి ఏటీఎంలు అందుబాటులో ఉండవు. సాధారణంగా ఖైదీల కుటుంబ సభ్యులో, స్నేహితులో కారాగారానికి వెళ్లి వారికి డబ్బు అందజేస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారనుంది. బీహార్‌లో పూర్ణియా సెంట్రల్ జైలులో ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏటీఎంను ఏర్పాటు చేయనున్నారు. ఖైదీల కోసం జైలుకు వచ్చే వారి కుటుంబ సభ్యుల రద్దీగా ఎక్కువగా ఉండటంతో పూర్ణియా జైలు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

పూర్ణియ జైలు సూపరెడెంట్ జితేంద్ర కుమార్ ఈ విషయంపై చొరవ తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసి 15 రోజుల్లోనే ATM వస్తుందని ఊహిస్తున్నారు. మొత్తం ఈ జైలులో 750 మంది ఖైదీలు ఉన్నారని.. అందులో 600 మందికిపైగా తదితర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని జితేంద్ర కుమార్ చెప్పారు. 400 మందికి ATM కార్డులు జారీ చేశామని, మిగిలిన వారికి త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా ఖైదీలను చూసేందుకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులను తగ్గించేందుకు సహాయపడుతుందని అన్నారు. సబ్బులు, కొబ్బరి నూనెలు, తినదగిన వస్తువులతో పాటు రోజువారీ ఉపయోగించే వస్తువులను ఖైదీలు కొనుగోలు చేసేందుకు కార్డులు ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.

కారాగారం పరిసరాల్లో పనిచేసినందుకు గాను ఖైదీలకు రోజులు నాలుగు గంటలకు రూ.52, ఎనిమిది గంటలకు రూ. 103లను వేతనంగా ఇస్తారు. ఆ సొమ్మును సంబంధిత ఖైదీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో ఖైదీ రూ.500ల వరకు తమ దగ్గర ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఈ వేతనాలను జనవరి 2019 వరకు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇటీవల కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఖైదీలకు మాస్కులు అందజేసేందుకు వివిధ జైళ్లకు వాటిని పంపిణి చేశారు.

నాలుగేళ్ల క్రితం నాగ్‌పుర్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఖైదీలు ఉపయోగించేందుకు SBI ఏటీఎం కార్డులను అందించారు. జైలును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మహారాష్ట్రలోని 9 సెంట్రల్ జైళ్లలో 10వేల మందికి పైగా ఖైదీలకు ఏటీఎం కార్డు సౌకర్యాన్ని విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: ATM, Bihar, Jail

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు