హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fishermen missing: అల్లకల్లోలంగా సముద్రం.. 15 పడవలు బోల్తా.. మత్స్యకారులు గల్లంతు

Fishermen missing: అల్లకల్లోలంగా సముద్రం.. 15 పడవలు బోల్తా.. మత్స్యకారులు గల్లంతు

అల్లకల్లోలంగా గుజరాత్ తీరం

అల్లకల్లోలంగా గుజరాత్ తీరం

Fishermen Missing: బుధవారం రాత్రి పడవలను ఒడ్డుకు చేర్చి, వాటిలోనే నిద్రపోయారు. ఐతే తెల్లవారుజామున అలల ఉద్ధృతి పెరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడి పడవలను సముద్రంలోకి లాక్కెళ్లాయి

భారత తీర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తూర్పు తీరం వైపు జవాద్ తుఫాన్ దూసుకొస్తుండగా.. పశ్చిమ తీరంలోనూ అల్పపీడనం నెలకొంది. దాని ప్రభావంతో గుజరాత్ తీరం (Gujarat Coast) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. గిర్ సోమనాథ్ (Gir Somnath)జిల్లాలో అలలు, ఈదురు గాలుల ధాటికి 12 నుంచి 15 పడవలు బోల్తా పడ్డాయి. 12 మంది మత్స్యకారులు సముద్రంలో పడి కొట్టుకుపోయారు. యునా తాలుకాలోని నవబందర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో పడిన మత్స్యకారుల్లో నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్లతో సముద్రంలో గాలిస్తున్నారు.

What an Idea: ఐడియా అంటే ఇది.. కుక్కర్ ప్రెజర్‌తో క్షణాల్లోనే వేడి వేడి కాఫీ..

నిన్న ఉదయం నుంచి గుజరాత్ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. వాతావరణ భయంకరంగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ రెండు రోజులుగా హెచ్చరిస్తోంది. ఐనా కొందరు మత్స్యకారులు అవేటీ పట్టించుకోకుండా సముద్రంలోకి వేటకు వెళ్లారు. బుధవారం రాత్రి పడవలను ఒడ్డుకు చేర్చి, వాటిలోనే నిద్రపోయారు. ఐతే తెల్లవారుజామున అలల ఉద్ధృతి పెరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడి పడవలను సముద్రంలోకి లాక్కెళ్లాయి. పడవలు బోల్తా పడడంతో మత్స్యకారులు సముద్రంలో పడి కొట్టుకుపోయారు. 8 మంది గల్లంతయ్యారని, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారని యునా అధికారులు వెల్లడించారు. ఐతే స్థానికులు మాత్రం 10 నుంచి 15 మంది మత్స్యకారులు కొట్టుకుపోయారని చెబుతున్నారు. 10 పడవలు పూర్తిగా ధ్వంసవమగా, మరో 40 పడవలు పాక్షిక్షంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

Vaccine Offer: బంపర్ ఆఫ‌ర్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 60 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ

అల్పపీడన ప్రభావంతో గుజరాత్‌లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌తో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున, ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

First published:

Tags: Arabian sea, Fishermen, Gujarat

ఉత్తమ కథలు