మంచి, చేడుల కంటే అందానికే విలువనిచ్చే సమాజం మదని.. అందంగా ఉన్నవాళ్లని ఒకలాగా, లేని వాళ్లని మరోలా ట్రీట్ చేసే మానవ జాతి మనది..! రంగులోనో, రూపంలోనో కాస్త తక్కువగా ఉంటే చులకన చేసే వాళ్లే ఎక్కువ..! ముఖ్యంగా యాసిడ్ దాడి బాధితుల బాధలు చెప్పుకుంటే తీరిపోలేనివి.. అనుభవించేవారికే తప్ప ఇతరులకు అర్థం కానివి.. వారిని ఆధారించేవాళ్లు.. కనీసం వాళ్లవైపు కన్నెత్తి చూసేవాళ్లూ ఉండరు..! అటు వ్యక్తిగతంగా, ఇటు సమాజం నుంచి పడరాని పాట్లు పడతారు.. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తారని.. ఏళ్ల పాటు ఇంటికే పరిమితమయ్యే జీవితాలు ఎందరివో..! మరోవైపు గాయాల తీవ్రత.. సర్జరీల మీద సర్జరీలు అనివార్యమైన పరిస్థితి. ప్రియురాలిపై యాసిడ్ దాడి ఘటనలు ఎన్నో విన్నం.. చూశాం.. కానీ సొంత తండ్రే.. తన కూతురిపైన యాసిడ్ దాడి చేసి ఘటన గురించి విన్నారా..? అది కూడా మూడేళ్ల కూతురుపై..? ఉత్తర ప్రదేశ్‌లోని ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రాలో చాలా సంవత్సరాల క్రితం జరిగిన రాక్షస ఘటన ఇది.. అయితే ఆ మూడేళ్ల చిన్నారి ఇప్పుడు పెరిగి, పెద్దదై నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది.. ఎలాగో తెలుసా..?
మగబిడ్డ పుట్టలేదని యాసిడ్ దాడి:
నీతూకు కేవలం 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు. ఫతేపూర్ సిక్రీలోని అమ్మమ్మ ఇంటి బయట తన చెల్లి, తల్లితో కలిసి నిద్రపోతున్న సమయంలో దారుణం జరిగింది. సరిగ్గా అప్పుడే అతని తండ్రి, మేనమామ బాబా తన అమ్మమ్మ ఇంటికి చేరుకోగా నీతూ తన తల్లి, చెల్లెలిపై యాసిడ్ పో. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కూతుళ్ల తీవ్రంగా కాలిపోయారు. అప్పటికి చిన్న కూతురు వయసు ఏడాదిన్నర మాత్రమే. చికిత్స పొందుతూ ఆమె బతకలేక చనిపోయింది. ఈ ఘటనలో, నీతూ తల్లి గీతా దేవి ప్రాణాలతో బయటపడ్డారు.. కాని వారి జీవితం మొత్తం అంధకరమైపోయింది. ఎందుకంటే ఇద్దరి ముఖం పూర్తిగా కాలిపోయింది. నీతూ కంటి చూపు కోల్పోయింది.. గీతాదేవికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని.. తండ్రికి మగబిడ్డ కావాలని అందుకే బంధువులతో కలిసి ఈ యాసిడ్ దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నీతూ తండ్రిని కుటుంబ సభ్యులు రెచ్చగొట్టి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. దీంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తండ్రికి, బంధువులకు కూడా రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత సమాజం నుంచి ఎదుర్కొన్న ఒత్తిడితో కేసును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
స్టార్టప్‌తో ముందుకు:
ఏళ్లు గడిచిపోయాయి.. తమ తలరాత ఇంతేనని మొదట నీతూ భావించింది.. అయితే కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత నీతూ ఆలోచనలో మార్పు వచ్చింది.. తన లాగే యాసిడ్ బాధితులు చాలా మంది ఉన్నారని తెలుసుకున్న ఆమె.. తన కాళ్ల మీదే తాను నిలబడాలని బలంగా నిర్ణయించుకుంది. కొత్త జీవితం ప్రారంభించింది. మొదట షిరోజ్ హ్యాంగ్ అవుట్ కేఫ్‌లో పనిచేసింది. కేఫ్‌లో పరాఠాలు తయారు చేసేటప్పుడు వచ్చే పొగ వేడిని తట్టుకోవడం కష్టమని..తన ముఖం అప్పటికే అనే సర్జరీలు ఫేస్ చేసిందని.. అయితే జీవితంలో ఇలాంటి కష్టమైన దశలు ఉంటాయని అర్థం చేసుకున్నానంటోంది నీతూ. లింగ వివక్ష చూపించే సమాజంలో బతకడానికి ఎంతో ధైర్యం కావాలంటోంది.. ఆ తర్వాత కేఫ్ నుంచి బయటకు వచ్చిన ఆమె స్టార్టప్ పెట్టింది. రోజ్గార్ భారతి సహకారంతో ప్రారంభించిన నీతూ అనే స్టార్టప్‌పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh