Home /News /national /

AT MINUS 40 DEGREES CELSIUS YOU WILL BE SURPRISED IF YOU READ HOW THEY ARE SETTING UP DRINKING WATER PIPE LINE TO THOSE VILLAGES UMG GH

Ladakh: గడ్డకట్టే చలిలోనూ ఆ గ్రామాలకు తాగునీరు.. పైప్‌లైన్ ఎలా వేస్తున్నారంటే.. చదివితే ఆశ్చర్యపోతారు !

 మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆ గ్రామాలకు తాగునీటి పైప్ లైన్..  ఎలా ఏర్పాటు చేస్తున్నారో చదివితే ఆశ్చర్యపోతారు !

మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆ గ్రామాలకు తాగునీటి పైప్ లైన్.. ఎలా ఏర్పాటు చేస్తున్నారో చదివితే ఆశ్చర్యపోతారు !

జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌( Ladakh) ప్రాంత సరిహద్దు గ్రామాల్లో నివసించే జనాలు తీవ్ర నీటి కొరత (Water Shortage)తో బాధపడుతున్నారు. ప్రతికూల వాతావరణంలో నీళ్లు తెచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం వారికి పెద్ద ఊరట కల్పించింది.

ఇంకా చదవండి ...
జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌(Ladakh) ప్రాంత సరిహద్దు గ్రామాల్లో నివసించే జనాలు తీవ్ర నీటి కొరత (Water Shortage)తో బాధపడుతున్నారు. ప్రతికూల వాతావరణంలో నీళ్లు తెచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం వారికి పెద్ద ఊరట కల్పించింది. చుషుల్ (Chushul) నుంచి డెమ్‌చోక్ (Demchok), చుమర్ (Chumar) వరకు 174-కిమీల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలోని ఇళ్లకు కుళాయి నీటిని అందించడం ప్రారంభించింది. మోదీ సర్కార్ వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి లడఖ్‌లో చైనాతో సరిహద్దును పంచుకుంటున్న అన్ని ప్రాంతాల్లో ట్యాప్ వాటర్ పరిచయం చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్‌ (Jal Jeevan Mission) ద్వారా అక్కడి ప్రజలు మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా పంపు నీటిని పొందుతున్నారు. ఈ ట్యాప్ వాటర్ ఫెసిలిటీతో అక్కడి ప్రజల నీటి కష్టాలు తప్పుతున్నాయి.

పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న మాన్-మెరాక్‌లోని కుటుంబాలు కూడా కుళాయి నీటిని పొందుతున్నారు. గోగ్రా-హాట్ స్ప్రింగ్ ప్రాంతానికి యాక్సెస్ రోడ్డుకు రక్షణగా ఉన్న ఫోబ్రాంగ్ వంటి ఇతర గ్రామాలలో కూడా ట్యాప్ వాటర్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు, లేహ్ జిల్లాలో 11,000 కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఊహించిన దానికంటే ఇవి 47% ఎక్కువ. ఎటు చూసినా పర్వతాలు, ఒంటరైన నివాసాలు, రహదారి సౌకర్యం లేని గ్రామాలు, మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత, మంచుతో కప్పబడిన రహదారుల వంటి అత్యంత ప్రతికూల పరిస్థితులలో బతికే ప్రజలకు ట్యాప్ వాటర్ అందించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు.

ఇదీ చదవండి:  Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!
 దేశంలోని సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు సరిహద్దు వాసుల జీవనాన్ని కూడా మెరుగుపరుస్తోంది మోదీ(Pm modi) ప్రభుత్వం. లడఖ్‌లోని జీరో-కిమీ గ్రామమైన డెమ్‌చోక్‌లో కుళాయిలు ప్రారంభించిన తర్వాత జల్ జీవన్ మిషన్ లడఖ్‌లోని మారుమూల గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకువస్తోందని జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేశారు. “చలికాలంలో నీటిని పైపుల ద్వారా ప్రజల వద్దకు పంపించడం మా ప్రధాన సవాలు. రెండవది తాగునీటికి శాశ్వత వనరులను గుర్తించడం. రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పైపులు, ఇతర సామగ్రిని తీసుకెళ్లడం మరో సవాలుగా మారింది. వారికి అధునాతన, సృజనాత్మక సొల్యూషన్స్ అవసరం,” అని ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి భూభాగంపై కృషి చేస్తున్న లేహ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ బాలాసాహెబ్ సూసే చెప్పారు.లడఖ్‌లోని మారుమూల గ్రామాలకు మిషన్ బృందం మెటల్ బదులుగా హైడెన్సిటీ పాలిథిలిన్ (HDPE) పైపులను ఎంచుకుంది. ఫ్రాస్ట్ లైన్ క్రింద నీటిని సరఫరా చేసే పైపులు వేయడం జరిగింది. బయటికి కనిపించే పైపులపై గాజు ఉన్ని, అల్యూమినియంతో కవర్ చేయడం జరిగింది. ఎక్కువగా గురుత్వాకర్షణ శక్తి నీటి ప్రవాహానికి ఉపయోగించారు. భూగర్భ జలాలు మూలంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్ పంపులు వాడారు. ఈ కుళాయిలను ఏర్పాటు చేయడానికి కావలసిన మెటీరియల్‌ని, మనుషులను మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్స్ ఉపయోగించారు. ఈ పనులు జరుగుతున్నప్పుడు తూర్పు లడఖ్‌లో భారత సైన్యం కూడా చేయూతను అందించింది. కొత్తగా ఏర్పాటైన పంపు నీరు సదుపాయంతో తీవ్రమైన చలిలో ఉదయం నీటిని తెచ్చుకునే భారం తప్పిందని ప్రజలు సంతోషిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: China, Jammu and Kashmir, Ladakh, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు