Home /News /national /

AT LEAST SIX JAWANS INJURED AFTER SUSPECTED MILITANTS HURL GRENAD OPEN FIRE AT CRPF TEAM IN SRINAGAR SK

దీపావళి వేళ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. CRPF టీమ్‌పై గ్రెనేడ్ దాడి, కాల్పులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రెనేడ్ పేలుడుతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారిపోయిన ఉగ్రవాదుల కోసం అదనపు బలగాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి.

    దీపావేళి వేళ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కరన్‌నగర్ ప్రాంతంలో CRPF బలగాలే టార్గెట్‌గా దాడి చేశారు. జవాన్ల బృందంపై గ్రెనేడ్ విసిరి.. కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న జవాన్లు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. దాంతో అక్కడి నుంచి టెర్రరిస్టులు పారిపోయారు. కాల్పుల్లో ఆరుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రెనేడ్ పేలుడుతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారిపోయిన ఉగ్రవాదుల కోసం అదనపు బలగాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jammu and Kashmir, Srinagar, Terror attack, Terrorists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు