స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు ..9 మంది కార్మికులు మృతి..!

కోక్ ఓవెన్ సెక్షన్‌లో గ్యాస్ పైప్ లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. ప్రభుత్వ రంగసంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నడుస్తోంది.

news18-telugu
Updated: October 9, 2018, 3:16 PM IST
స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు ..9 మంది కార్మికులు మృతి..!
భిలాయ్ స్టీల్ ప్లాంట్ చెలరేగుతున్న మంటలు
  • Share this:
చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోయారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. పేలుడు ధాటికి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. మరికొందరి శరీర భాగాలు తెగిపడ్డాయి. ఆ డెడ్‌బాడీలను గుర్తు పట్టడం కష్టంగా మారింది.

పేలుడు ధాటికి ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కోక్ ఓవెన్ సెక్షన్‌లో గ్యాస్ పైప్ లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ, కార్మికశాఖలు ప్లాంట్ యాజమాన్యం నుంచి నివేదిక కోరాయి.

ఘటనపై చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ స్థానిక నేతలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ రంగసంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నడుస్తోంది. ఇదే ప్లాంట్‌లో 2014లో కూడా ప్రమాదం జరిగింది. ఫర్నేస్‌లో పేలుడు సంభవించడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. గత ఏడాది ఉత్తర ప్రదేశ్‌లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఎన్టీపీసీలో పేలుళ్ల కారణంగా 43 మంది చనిపోయారు.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2018, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading