ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి షాకింగ్ అనుభవం ఎదరైంది. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే పంజాబ్‌లో గంటలపాటు ప్రధానికి దాదాపు రక్షణ లేకుండా పోయింది. దేశంలో తిరుగులేని నేతగా కొనసాగుతోన్న మోదీకి వెళ్లడానికి దారి లేకుండా పోయింది. ఈ ఘటన తర్వాత తాను ప్రాణాలతో బయట పడగలిగానని ప్రధాని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది..
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా, దేశంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) భద్రత కలిగిన ఏకైక నేతగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి షాకింగ్ అనుభవం ఎదరైంది. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే పంజాబ్‌లో గంటలపాటు ప్రధానికి దాదాపు రక్షణ లేకుండా పోయింది. దేశంలో తిరుగులేని నేతగా కొనసాగుతోన్న మోదీకి వెళ్లడానికి దారి లేకుండా పోయింది. నిమిషాలపాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే నిలిచిపోయింది. ఆ సమయంలో ఇతర ప్రైవేటు వాహనాలు ప్రధాని కాన్వాయ్ పక్కనుంచే వెళ్లడం సర్వత్రా టెన్షన్ రేకెత్తించింది. ప్రధాని ప్రయాణించే రోడ్డు మార్గాన్ని రైతులు దిగ్భందించడంతో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో చివరికి తాను ప్రాణాలతో తిరిగి రాగలిగానని ప్రధాని వ్యాఖ్యానించడం మరింత సంచలనం రేపింది. కాంగ్రెస్ సీఎం చన్నీ మాత్రం బీజేపీ సభ అట్టర్ ప్లాప్ కావడంతో కవరింగ్ కోసమే మోదీ లేని సెక్యూరిటీ వైఫల్యాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. వివరాలివి..
భద్రతా కారణాల రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దు కావడం, తిరిగి బటింటా విమానాశ్రయానికి ఆయన చేరుకోవడం వంటి ఘటనలు బుధవారం పంజాబ్‌లో చోటుచేసుకున్నారు. ''ప్రాణాలతో బటిండా విమానాశ్రయానికి చేరుకున్నా. మీ ముఖ్యమంత్రికి థాంక్స్'' అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులతో అన్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది. దీనికి ముందు బటిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు కాన్వాయ్‌లో వెళ్లిన ప్రధానికి అనూహ్య అనుభవం ఎదురైంది. ఏడేళ్లలో దాదాపు తొలిసారి మోదీ కాన్వాయ్ భద్రతా కారణాలతో నిలిచిపోయింది.
ఫిరోజ్‌పూర్ సమీపంలోని ఫ్లైఓవర్‌ను రైతులు దిగ్బంధించడంతో ప్రధాని తన కారులోనే సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయారు. ప్రైవేటు కార్లు సైతం పీఎం కాన్వాయ్ వైపు రావడంతో దీనిని భద్రతా వైఫల్యంగా కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) తప్పుపట్టింది. అనంతరం ప్రధాని ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయింది. ప్రధాని కాన్వాయ్ వెళ్లేంతవరకూ రోడ్లపై ఇతర వాహనాల రాకపోకలు లేకుండా చూడటంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోం శాఖ ఆరోపించింది.
పంజాబ్ పోలీస్ డీజీపీ ఆధ్వర్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు జరిగినట్టు ధ్రువీకరించడంతోనే ప్రధాని రోడ్డు ప్రయాణం చేపట్టామని కేంద్ర హోం శాఖ తెలిపింది. ముందుగా అనుకున్న ప్రకారం హుస్సైనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు హెలికాప్టర్లో ప్రధాని చోరుకోవాల్సి ఉంది. అయితే వర్షం, దారి సక్రమంగా కనిపించకపోవడంతో రోడ్లు ప్రయాణం సాగించాలని నిర్ణయించారు. వాయిమార్గంలో వెళ్లాల్సిన ప్రధాని రహదారి గుండా వస్తున్నారనే సమాచారంతో రైతులు నిరసనలకు దిగారు.
ప్రధాని పర్యటనలో భద్రతా లోపం జరిగనట్టు వచ్చిన ఆరోపణలను పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ రాజ్‌కుమార్ వెర్కా తోసిపుచ్చారు. ''ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. బీజేపీ నేతలు జనాలను సభకు రప్పించడంలో విఫలం కావడంతో ర్యాలీ ఫ్లాప్ అయింది'' అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ప్రధాని ఫిరోజ్‌పూర్ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజా పరిణామాలతో ప్రధాని ర్యాలీ రద్దయింది. కాగా, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఛన్ని కనీసం ఫోను కూడా ఎత్తలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.