AT LEAST 18 INDIANS AMONG 23 PEOPLE KILLED IN SUDAN SK
సూడాన్ పేలుడులో 18 మంది భారతీయులు మృతి
సూడాన్‌లో పేలుడు
ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంబసీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షిస్తున్నారని.. వివరాల కోసం 24 గంటల ఎమర్జెన్సీ హాట్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సూడాన్‌లో మంగళవారం రాత్రి భారీ పేలుడు జరిగి 23 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఐతే మృతుల్లో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొందరు చనిపోయిన ఉండవొచ్చని వెల్లడించింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేకపోతున్నామని తెలిపింది. ఇక ఈ ఘటనలో 34 మంది భారతీయులు సురక్షితంగా బయటపడగా.. మరో ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంబసీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షిస్తున్నారని.. వివరాల కోసం 24 గంటల ఎమర్జెన్సీ హాట్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
The Embassy representative has rushed to the site. A 24-hour emergency hotline +249-921917471 has been set up by @EoI_Khartoum.
Embassy is also putting out updates on social media.
Our prayers are with the workers and their families.
కాగా, మంగళవారం రాత్రి సూడాన్ రాజధాని ఖర్తూమ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సీరా సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.ఈ ప్రమాదంలో 23 మంది చనిపోయారు. మరో 130 మందికి పైగా గాయపడ్డారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుల వివరాలు
సూడాన్ బ్లాస్ట్‌లో గల్లంతైన భారతీయుల వివరాలు
ప్రాణాలతో బయటపడ్డ భారతీయుల వివరాలు
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.