హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Floods: బీహార్ ను భయపెడుతున్న వరదలు.. 14 మంది మృతి

Bihar Floods: బీహార్ ను భయపెడుతున్న వరదలు.. 14 మంది మృతి

మొత్తం మీద గ్రామస్తులు, యువకులు కలిసి వాగులో చిక్కుకున్న వారందరిని సురక్షితం ఒడ్డుకు చేర్చడంతో 
పెను ప్రమాదం తప్పి అందరు ఊపిరి పీల్చుకున్నారు.

మొత్తం మీద గ్రామస్తులు, యువకులు కలిసి వాగులో చిక్కుకున్న వారందరిని సురక్షితం ఒడ్డుకు చేర్చడంతో పెను ప్రమాదం తప్పి అందరు ఊపిరి పీల్చుకున్నారు.

బీహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా మూడు వేర్వేరు ఘటనల్లో దాదాపు 14 మంది వరద నిటిలో మునిగి చనిపోయారని బుధవారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

  బీహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా మూడు వేర్వేరు ఘటనల్లో దాదాపు 14 మంది వరద నిటిలో మునిగి చనిపోయారని బుధవారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్క ఖాగారియా జిల్లాలోనే తొమ్మిది మరణాలు చోటు చేసుకున్నాయి. సహర్సా జిల్లాలో ముగ్గురు, దర్భాంగా జిల్లాల్లో ఇద్దరు వరద కారణంగా చనిపోయారు. మంగళవారం సాయంత్రం మాన్సీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గండక్ నదిలో పడవలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ఘటనలో తప్పిపోయిన వారి సంఖ్య ఇంకా తెలియలేదు. ఈ ఘటనలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల్లో 10 ఏళ్ల బాలుడు, 12 సంవత్సరాల అమ్మాయి సైతం ఉన్నారు.

  దర్భంగాలో హయఘాట్ మంగళవారం రాత్రి కరేహ్ నదిలో 13 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. 10 మంది ఈత కొట్టుకుంటూ ప్రాణాలు దక్కించుకున్నారు. 40-45 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు మహిళల మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ అనేక గంటల ఆపరేషన్ అనంతరం స్వాధీనం చేసుకుంది. 16 ఏళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. సహర్సాలో, సిల్ఖువా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కోసి నదిలో 13 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది.

  ఎనిమిది మంది ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో ఐదేళ్ల బాలుడు, అతడి తండ్రితో పాటు 15 ఏళ్ల బాలిక కూడా ఉన్నారు. బాలుడి తల్లి, 25 సంవత్సరాల వయస్సు ఉన్న మరొక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియలేదు. వరద మరణాలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు త్వరగా ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bihar, Bihar floods, Heavy Rains, Nitish Kumar

  ఉత్తమ కథలు