హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

దేవుడా.. ఇదెక్కడి ఘోరం! : బస్సులో మంటలు చెలరేగి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం -video

దేవుడా.. ఇదెక్కడి ఘోరం! : బస్సులో మంటలు చెలరేగి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం -video

దగ్ధమవుతోన్న బస్సు

దగ్ధమవుతోన్న బస్సు

వాహనాలను ఓవర్ టేక్ చేసుకుంటూ ఎదురుగా దూసుకొచ్చిన ట్యాంకర్ ను ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. క్షణాల్లోనే బస్సు మొత్తం దగ్ధమైపోయింది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 12 మంది బస్సులోనే సజీవ దహనం అయ్యారు.. ప్రఖ్యాత బల్మేర్-జోధ్ పూర్ హైవేపై ఇవాళ చోటుచేసుకున్న విషాదమిది..

ఇంకా చదవండి ...

అది పేరుకే జాతీయ రహదారి.. అత్యంత రద్దీ ఉండే మార్గం కూడా.. కానీ దానిపై ప్రయాణం సవాలుతో కూడింది.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న కష్టమే.. అలాంటి రోడ్డుపై 25 మంది ప్రయాణికులతో వెళుతోన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.. వాహనాలను ఓవర్ టేక్ చేసుకుంటూ ఎదురుగా దూసుకొచ్చిన ట్యాంకర్ ను ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. క్షణాల్లోనే బస్సు మొత్తం దగ్ధమైపోయింది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 12 మంది బస్సులోనే సజీవ దహనం అయ్యారు.. ప్రఖ్యాత బల్మేర్-జోధ్ పూర్ హైవేపై ఇవాళ చోటుచేసుకున్న విషాదమిది..

రాజస్ధాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళుతోన్న ఓ బస్సును ఎదురుగా దూసుకొచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. ఆ ఘాతానికి బస్సులో ఒక్కసారే మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అందరూ దిగడానికి అవకాశం లేకుండా క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఏకంగా 12 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బల్మేర్-జోధ్ పూర్ హైవేపై బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పేసి, మృతదేహాలను బయటికి తీశారు. గాయపడ్డ ఇంకొందరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సీఎం గెహ్లాట్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే మదన్ ప్రజాపత్, ఇంచార్జి మంత్రి సుఖ్ రామ్ విష్ణోయ్ ప్రమాద స్థలికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

నడిరోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతైపోవడంతో బల్మేర్-జోధ్ పూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఉదయం 9.55కు బలోత్రాలో బస్సు బయలుదేరిందని, హైవేపై ప్రయాణిస్తుండగా, ఎదరుగా దూసుకొచ్చిన ట్యాంకర్ ను ఢీకొట్టిందని, ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bus acident, Fire Accident, Rajastan

ఉత్తమ కథలు