హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sivakasi Fire Accident: తమిళనాడులోని బాణాసంచా పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Sivakasi Fire Accident: తమిళనాడులోని బాణాసంచా పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

ప్రమాదం సంభవించిన బాణాసంచా పరిశ్రమ

ప్రమాదం సంభవించిన బాణాసంచా పరిశ్రమ

తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శివకాశిలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో అకస్మాత్తుగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు, మంటలు వ్యాపించడంతో...

  శివకాశి: తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శివకాశిలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో అకస్మాత్తుగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు, మంటలు వ్యాపించడంతో ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో.. 11 మంది చనిపోయారు. 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 28 మంది తీవ్రంగా గాయపడగా, అందులో నలుగురికి 90 శాతం శరీరం కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు వైద్యాధికారి ఒకరు తెలిపారు.

  క్షతగాత్రులకు చికిత్సనందించేందుకు ఐదు ప్రత్యేక వైద్య బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం పళనిస్వామి, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని పేర్కొన్న ప్రధాని చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ అగ్ని ప్రమాదానికి ప్రస్తుతానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Fire Accident, Tamilnadu

  ఉత్తమ కథలు