హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi : అభివృద్ధే బీజేపీకి పరమావధి..వచ్చే 25 ఏళ్లు బీజేపీవే..రోడ్‌ మ్యాప్‌ను రూపొందించిన మోదీ

PM Modi : అభివృద్ధే బీజేపీకి పరమావధి..వచ్చే 25 ఏళ్లు బీజేపీవే..రోడ్‌ మ్యాప్‌ను రూపొందించిన మోదీ

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

PM MODI IN Jaipur Meet : . ఈ ఎనిమిదేళ్లు బీజేపీ ప్రభుత్వం.. పేదల సంక్షేమానికి, సామాజిక భద్రత,సుపరిపాలనకు ఎంతో కృషి చేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీజేపీ అంటే దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. దేశ ప్రజలంతా ఎంతో విశ్వాసంతో, ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు.

ఇంకా చదవండి ...

At Jaipur Meet PM Modi Lays Out BJP Roadmap : మూడు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సు గురువారం నుంచి రాజస్తాన్‌ లోని జైపూర్‌(Jaipur) లో ప్రారంభం అయింది. ​. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పార్టీకి చెందిన కీలక నేతలంతా హాజరవుతున్నారు. జైపూర్​లో జరుగుతున్న బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో ఇవాళ(మే-20,2022)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వర్చువల్​ గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారి ఉచ్చులో పడొద్దని బీజేపీ(BJP) నేతలకు సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. దీనికై చిన్న చిన్న ఉద్రిక్త ఘటనల కోసం వెతుకుతున్నాయని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. భారత్​ కు ఉన్న సవాళ్లను అధిగమించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించాల్సిన ఆవశ్యకత బీజేపీపై ఉందన్నారు. వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఇదేనని పేర్కొన్నారు. దీంతో వచ్చే 25 ఏళ్లపాటు తామే అధికారంలో ఉండాలని భావిస్తున్నట్టు మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని నేతలను మోదీ కోరారు. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు చేస్తున్న విష ప్రచారాలు చేస్తున్నప్పటికీ..ఆ ఉచ్చులో పడకుండా జాతీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని అన్నారు. "ఆరం తో నహీ కర్నా హై (మేము విశ్రాంతి తీసుకోలేము). మన స్వాతంత్ర్య సమరయోధుల రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము, కానీ మన దేశ ప్రజలకు సేవ చేయవచ్చు. పార్టీకి కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు, మీ అందరిని చూసి నేను గర్విస్తున్నాను” అని ప్రధాని మోడీ అన్నారు, బీజేపీ కార్యకర్తలకు పనిలేకుండా కూర్చునే హక్కు లేదని అన్నారు.

ALSO READ China Bridge : బరితెగించిన చైనా..భారీగా సైన్యాన్ని తరలించేలా పాంగాంగ్ సరస్సుపై మరో బ్రిడ్జి

"భారతీయ జనతా పార్టీకి 1300మందికి పైగా ఎమ్మెల్యేలు, 400 మంది ఎంపీలు మరియు 100 మందికి పైగా రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అధికారాన్ని ఆస్వాదించడంపై దృష్టి సారిస్తే, మనం కూడా ఆ పని చేస్తాం. కానీ ఆ మార్గం మనకు కాదు, ”అని మోదీ అన్నారు. గతంలో దేశ ప్రజలు తమ జీవితాలను ప్రభుత్వాలు మెరుగుపరుస్తాయనే ఆశలన్నీ కోల్పోయిన సమయం ఉందని ప్రధాని అన్నారు. అయితే 2014 నుంచి బీజేపీ ఆ ఆలోచనను మార్చిందన్నారు. దేశంలోని ప్రతి పౌరుడి కోసం పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల పెరుగుతున్న ఆకాంక్షలు కనిపిస్తున్నాయి... ఇది మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మరియు ఇది మరింత సేవ చేయాలని మరియు ఆ దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకునేలా చేస్తుంది అని ప్రధాని చెప్పాడు.

ALSO READ  Land for Job scam : లాలూకి మరో షాక్.."ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్" లో లాలూ ఇంట్లో సీబీఐ సోదాలు

8 ఏళ్ల బీజేపీ పాలనపై ప్రధాని మోదీ మాట్లాడుతూ...ఈ ఎనిమిది సంవత్సరాలను 'సంకల్ప్', 'సేవా' మరియు 'గరీబ్ కళ్యాణ్', చిన్న రైతులు మరియు మధ్యతరగతి అంచనాలకు అంకితం చేశారు. ఈ ఎనిమిదేళ్లు బీజేపీ ప్రభుత్వం.. పేదల సంక్షేమానికి, సామాజిక భద్రత,సుపరిపాలనకు ఎంతో కృషి చేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీజేపీ అంటే దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. దేశ ప్రజలంతా ఎంతో విశ్వాసంతో, ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై అంతకుముందు ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని బీజేపీ మళ్లీ తీసుకువచ్చిందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్​ వైపు ఆసక్తిగా చూస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలని మోదీ సూచించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అభివృద్ధి రాజకీయాలను ప్రతిచోటా విస్తరించేందుకు కృషి చేయాలన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఇష్టపూర్వకంగా లేదా ఇష్టం లేకుండా ఉన్నా అభివృద్ధి రాజకీయాలను అనుసరించడానికి వారిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎన్నికల్లో అభివృద్ధి గురించి మాట్లాడాలి అని ప్రధాని అన్నారు.

First published:

Tags: Bjp, Jaipur, Pm modi

ఉత్తమ కథలు