Congress MLC Asks for 'Chulha': క‌ట్టెల పొయ్యి ఇవ్వండి.. గ్యాస్ ధ‌ర భ‌రించ‌లేక‌పోతున్నా: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

(ప్రతీకాత్మక చిత్రం)

గ్యాస్ స్టవ్(Gas stove) బ‌దులు క‌ట్టెల పొయ్యి ప్ర‌భుత్వం అందించాల‌ని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ (Uttar pradesh)  కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీప‌క్‌సింగ్‌ కోరారు. ప్ర‌స్తుతం మార్కెట్‌(Market)లో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌తో పోలిస్తే క‌ట్టెలు త‌క్కువ ధ‌ర‌కు దొర‌కుతున్నాయని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

  • Share this:
    గ్యాస్ స్టవ్(Gas stove) బ‌దులు క‌ట్టెల పొయ్యి ప్ర‌భుత్వం అందించాల‌ని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ (Uttar pradesh)  కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీప‌క్‌సింగ్‌ కోరారు. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌తో పోలిస్తే క‌ట్టెలు త‌క్కువ ధ‌ర‌కు దొర‌కుతున్నాయని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్సీ దీప‌క్‌సింగ్ ఈ విష‌యాన్ని త‌న‌కు భ‌వ‌నం కేటాయించిన ఇన్‌చార్జ్‌(In charge)కు లేఖ రాశారు.

    అస‌లు ఇప్ప‌ట్లో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు త‌గ్గేలా లేవ‌ని కావున క‌ట్టెల పొయ్యి వాడే అవ‌కాశం ఇవ్వండ‌ని కోరారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అందించిన భ‌వ‌నంలో క‌ట్టెల పొయ్యి ఉండేలా చూడాల‌ని కోరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు దాలిబాగ్‌లోని అపార్ట్‌మెంట్‌(Apartment)లో ఇళ్లు కేటాయించారు. త‌న‌కు నెల‌కు రెండు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్లు అవ‌స‌రం ప‌డుతున్నాయి. ప్ర‌తీ సారి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ నింపిచ‌డానికి రూ.975 అవుతున్నాయి. ఇంత ఖ‌ర్చు భ‌రించ‌డ క‌ష్టంగా ఉంద‌ని కావున క‌ట్టెల పొయ్యి వాడేలా అవ‌కాశం ఇవ్వ‌మ‌ని కోరారు. ప్ర‌స్తుతం క‌ట్టెలు వాడితే నెల‌కు రూ.500 మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

    Gas Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధర రూ.937... పేటీఎంలో రూ.900 క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా




    2024 వరకు ఎల్‌పీజీ(LPG) ధ‌ర త‌గ్గే అవ‌కాశం లేనంద‌ను త‌న‌తోపాటు తోటి శాస‌న స‌భ్యుల‌కు ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని ఆయ‌న కోర‌డం విశేషం. ల‌క్నోలో స‌బ్సిడీ(Subsidy)లేని ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ.900 ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సామాన్యులు ఈధ‌ర‌ల‌తో ఎలా బ‌త‌క‌గ‌ల‌రని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు.
    పెరుగుతున్న ధ‌ర‌లు..
    కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ ధర పెంచుతున్నాయి ఆయిల్ కంపెనీలు. ఒకే నెలలో రెండుసార్లు గ్యాస్ సిలిండర్ ధర పెంచిన సందర్భాలు ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన, రెండో వారం తర్వాత గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి. ఆగస్ట్ 1న సిలిండర్ ధరలు పెంచలేదు. కానీ ఆగస్ట్ రెండోవారంలో సిలిండర్ ధర రూ.25 పెరిగింది.  హైదరాబాద్‌(Hyderabad) గ్యాస్ సిలిండర్ ధర రూ.912 ఉండేది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ.937 చెల్లించాలి. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,000 కి చేరుకోవడానికి ఇంకో రూ.63 పెరిగితే చాలు. ఇక న్యూఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.884.50 కి చేరుకుంది.
    ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కాంగ్రెస్ డిమాండ్‌..
    ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్(Congress) పార్టీ ఇంధ‌న ధ‌ర‌ల పెంపుపై కేంద్రాన్ని అన్నివైపుల నుంచి ప్ర‌శ్నిస్తోంది. సామాన్యుడిపై అధిక భారంగా మారిని ఈ ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌గ్గించాలని డిమాండ్ చేస్తోంది. తొంద‌ర‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇటువంటి వాఖ్య‌లు చేయండం అధికార  పక్షం పై ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్ప‌డుతుందో చూడాలి.
    Published by:Sharath Chandra
    First published: