Home /News /national /

ASTRO NUMEROLOGIST REVEALS WHICH EMOJIS ARE MOST USED BY ZODIAC SIGNS UMG GH

World Emoji Day 2022: మీ రాశికి ఏ ఏమోజి కరెక్టో చూసుకోండి.. మేషం నుంచి మీనం వరకు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీలు ఇవే..!

ఏ రాశికి ఏ ఎమోజీ సరిపోద్దో చూసుకోండి

ఏ రాశికి ఏ ఎమోజీ సరిపోద్దో చూసుకోండి

మీకు ఇష్టమైన ఎమోజీతో మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.  సాధారణంగా ఉపయోగించే ఎమోజీల జాబితాను బట్టి వ్యక్తుల ప్రవర్తన, లక్షణాలను తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి ఏటా జులై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవంగా జరుపుకుంటారు.

మీకు ఇష్టమైన ఎమోజీతో మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. సాధారణంగా ఉపయోగించే ఎమోజీల జాబితాను బట్టి వ్యక్తుల ప్రవర్తన, లక్షణాలను తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి ఏటా జులై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఎమోజీల కారణంగా చాటింగ్ గతం కంటే మరింత సులభంగా, ఉత్తేజకరంగా మారింది. రాశిఫలాల ఆధారంగా ఏయే రాశులవారు ఎలాంటి ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారో తెలుసుకుందాం.

* మేషం
ఈ రాశి అగ్నికి సంకేతం. దీంతో ఈ రాశివారు జీవితంలో ఉన్నత స్థితి వెళ్లే అవకాశం ఉంది. వారు ఇష్టపడే ప్రతిదానిపై మక్కువ చూపుతారు. వారి జీవితంలో ప్రేమ అనే పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో పోరాడాల్సి వస్తే వెనుకాడరు. పరిస్థితులకు తగ్గట్టుగా ఈ రాశివారు సంతోషంతో కూడిన కన్నీళ్లతో ముఖం, కోపంగా ఉన్న ముఖం, కిరీటం ఉన్న వ్యక్తి ఎమోజీలను తరుచుగా ఉపయోగిస్తుంటారు.

* వృషభం
సౌకర్యవంతంగా, విలాసవంతమైన జీవనశైలిని ఈరాశివారు బాగా ఇష్టపడతారు. ఫ్యాషన్‌లో వారి అభిరుచి తగ్గట్టు ప్రతిదీ ఉత్తమంగా ఉండాలనుకుంటారు. హలోతో నవ్వుతున్న ముఖం, కాక్‌టెయిల్ గ్లాస్ లేదా వైన్ గ్లాస్, బాంబ్ వంటి ఎమోజీలను వృషభ రాశివారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఇదీ చదవండి: మరో కొత్త ప్రాణాంతక వైరస్..అసోంలో కేసు నమోదు..పందులని చంపేస్తున్న ప్రభుత్వాలు


* మిధునం
జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ సమ్ అనే పదాలు మిధునరాశికి బాగా సెట్ అవుతాయి. ఏదో ఒక విధంగా ఈ రాశివారికి ప్రతి విషయం తెలిసిపోతుంది. షేక్‌హ్యాండ్, స్త్రీ/పురుషుల డ్యాన్స్, ఆలోచించే ముఖం వంటి ఎమోజీలను వారు తరచు వాడుతుంటారు.

* కర్కాటకం
ఈ రాశివారితో రిలేషన్ ఉంటే అదృష్టం వరిస్తుంది. వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. ప్రేమతో పాటు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. తమ కంఫర్ట్ జోన్‌లో నివసించడానికి ప్రాధాన్యత ఇస్తారు. హృదయాంతో నవ్వుతున్న ముఖం, ఎరుపు గుండె, కన్నీళ్లను అడ్డుకునే ముఖం వంటి ఎమోజీలను ఎక్కువగా వాడుతుంటారు.

* సింహం
ఇతరులతో మాట్లాడే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూడడం లేదా ఇతరులకు అంతరాయం కలిగించడం ఈ రాశివారికి సర్వసాధారణం. వారు ఎంతో ఫన్నీగా ఉంటారు. నవ్వుతూ నేలపై రోలింగ్, బీర్ మగ్, సన్ గ్లాసెస్‌తో నవ్వుతున్న ముఖం వంటి ఎమోజీలను బాగా ఉపయోగిస్తారు.

* కన్య
నీటి సంకేతం కారణంగా ఈ రాశి ప్రతి విషయంలో పరిపూర్ణంగా ఉండాలని అనుకుంటుంది. అందుకు ఎంతో శ్రమించాలన్న సంగతి కన్యరాశికి బాగా తెలుసు. ఇంట్లో వారికి ఇష్టమైన ప్రదేశం అద్దం. ఫేస్ బ్లోయింగ్ ఎ కిస్, లిప్‌స్టిక్ లేదా స్పార్కల్స్, ఫ్లవర్ ఎమోజీలను ఉపయోగించడాన్ని బాగా ఇష్టపడతారు.* తుల
పోరులో తులారాశి వారిని నిలువరించడం చాలా కష్టం. అంతేకాకుండా ప్రతి ఒక్కరి సమస్యలను అర్థం చేసుకుంటారు. వారు కూడా ప్రేమలో ఉండటానికి ఇష్టపడతారు. విక్టరీ హ్యాండ్, ఒపెన్ చేతులతో నవ్వుతున్న ముఖం, నెయిల్ పాలిష్ వంటి ఎమోజీలను తరచూ ఉపయోగిస్తుంటారు.

* వృశ్చికం
ఈ రాశిలో జన్మించిన వారు సెల్ఫ్‌ మెసేజ్‌ అనే పదాన్ని వినడమే తప్ప దాన్ని ఎప్పుడూ అనుభవించి ఉండరు. ఇతర రాశుల కంటే అత్యంత నమ్మకంగా కనిపిస్తారు. సాహసం, ప్రమాదం, లైంగిక సాన్నిహిత్యం వారిని ఆకర్షిస్తుంది. వారికి ఇష్టమైన ఎమోజీలు ముద్దు గుర్తు, కొమ్ములతో కూడిన స్మైలీ ఫేస్, పుర్రె.

* ధనస్సు
ఈ రాశివారు అన్వేషకులు. సాహసాన్ని అమితంగా ఇష్టపడతారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనుభవాలను వెతుకుతూ ఉంటారు. గాలిలో ఆకు రెపరెపలాడడం, అధిక వోల్టేజ్, ఇంద్రధనస్సు వంటి ఎమోజీలను పదే పదే పంపుతూ ఉంటారు.

* మకరం
ఈరాశి వారు వర్క్‌హోలిక్‌లు. ఎవరి కోసమో దేన్ని వదిలిపెట్టడం వీరికి ఇష్టముండదు. విలాసవంతమైన, సురక్షితమైన జీవనశైలి గురించి కలలు కనడమే కాదు, దాని కోసం చాలా కష్టపడతారు. డాలర్ బ్యాంక్ నోట్, పుష్ పిన్, చార్ట్ ఇన్‌క్రిజింగ్ వంటి ఎమోజీలను బాగా ఇష్టపడతారు.

* కుంభం
కొత్త సాంకేతికత లేదా సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారిని ఆవిష్కర్తలుగా పరిగణిస్తారు. తమ ప్రత్యేక వ్యక్తిత్వాలను పాత ప్రపంచానికి చూపించడానికి భయపడరు. హార్ట్ హ్యాండ్స్, స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్ ఐస్, లైట్ బల్బ్ వంటి ఎమోజీలు వారికి బాగా ఇష్టమైనవి.

* మీనం
ఈరాశివారి యథార్థత మరో ప్రపంచంలా అనిపిస్తుంది. సున్నిత మనస్కులు. వారు సులభంగా పరధ్యానంలో వెళతారు. కానీ అవసరమైన వారికి సహాయం చేయడం ఎప్పటికీ మర్చిపోరు. మెరిసే హృదయం, యునికార్న్, షూటింగ్ స్టార్ వంటి ఎమోజీలను ఉపయోగించడంలో వారి అభిరుచి ప్రతిబింబిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Chat, Numerology, World emoji day, Zodiac sign

తదుపరి వార్తలు