Home /News /national /

దీపావళి రోజు మన గ్రహం మీదకు ఇద్దరు అతిథులు.. భూమికి చేరువగా వస్తున్న..

దీపావళి రోజు మన గ్రహం మీదకు ఇద్దరు అతిథులు.. భూమికి చేరువగా వస్తున్న..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ దీపావళి పండుగకు మన గ్రహాం మీదకు అంతరిక్షం నుంచి ఇద్దరు అతిథులు రానున్నారు. నవంబర్ 14వ తేదీ రాత్రి ఆస్టరాయిడ్ 2020 TB9, ఆస్టరాయిడ్ 2020 ST1 భూ కక్ష్య పరిధిలోకి రానున్నాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది.

ఈ దీపావళి పండుగకు మన గ్రహాం మీదకు అంతరిక్షం నుంచి ఇద్దరు అతిథులు రానున్నారు. నవంబర్ 14వ తేదీ రాత్రి ఆస్టరాయిడ్ 2020 TB9, ఆస్టరాయిడ్ 2020 ST1 భూ కక్ష్య పరిధిలోకి రానున్నాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. వీటి వల్ల మనకు ఎటాంటి ప్రమాదమూ ఉండకపోవచ్చని నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) పేర్కొంది. భూమికి దగ్గరగా వచ్చే ఖగోళ వస్తువులపై సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ ఒక కన్నేసి ఉంచుతుంది. ఈ రెండు గ్రహశకలాలూ NEO ఆస్టరాయిడ్స్ అని ఆ సంస్థ తెలిపింది. భూమి కక్ష్యకు దగ్గరగా ఉండే గ్రహశకలాలు, చిన్న గ్రహాలను NEO ఆస్టరాయిడ్స్ అంటారు. ఇవి మన వాతావరణంలోకి ప్రవేశించవు. ఇవి భూమిపై కూలిపోయే అవకాశం, భూమి లోపలి కక్ష్యలోకి వచ్చే అవకాశాలు లేవని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, CNEOS రెండూ ధ్రువీకరిస్తున్నాయి.

మరో రెండు కూడా..
వీటితో పాటు మరో రెండు స్పేస్ రాక్స్ కూడా భూమికి దగ్గరగా రానున్నాయని నాసా ప్రకటించింది. 2020 VL1 అనే గ్రహశకలం నవంబరు 13న, 2019 VL5 ఆస్టరాయిడ్ ఈ నెల 15వ తేదీల్లో భూమిని దాటనున్నాయి. భూమికి, చంద్రుడికి మధ్యలో ఉన్న దూరానికి మూడు రెట్ల దూరంలో 2020 VL1, తొమ్మిది రెట్ల దూరంలో 2019 VL5 గ్రహశకలాలు ఉన్నాయని స్పేస్ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. వీటితో పోలిస్తే నవంబర్ 14 నాటికి భూమికి దగ్గరగా వచ్చేవి కొంచెం దగ్గరగా ఉన్నాయి. 2020 TB9 అనేది చాలా చిన్న గ్రహశకలం. దీని పరిమాణం 30 మీటర్ల వరకు ఉంటుంది. సాధారణ విమానం పొడవు కూడా దాదాపు ఇంతే ఉంటుంది. ఇది భూమికి ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్పేస్ రాక్ గంటకు 21,600 కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొస్తుంది.

కుతుబ్ మినార్‌కు రెండు రెట్ల పొడవు
ఆస్టరాయిడ్ 2020 ST1 పొడవు 175 మీటర్ల వరకు ఉంటుందని నాసా ప్రకటించింది. కుతుబ్ మినార్ ఎత్తు 73 మీటర్లు. దీన్ని బట్టి చూస్తే ఈ గ్రహశకలం వ్యాసం కుతుబ్ మినార్‌కు 2.3 రెట్లుగా ఉంటుంది. ఇది భూమి నుంచి 7.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహశకలం 30,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొస్తుంది. ఈ రెండు గ్రహశకలాలనూ భూమి నుంచి నేరుగా చూడటం సాధ్యం కాదు. లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ ద్వారా మాత్రమే వీటిని చూడవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Asteroid, Diwali 2020, Earth

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు