హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi: త్రిమూర్తులతో త్రిపురను బలోపేతం చేస్తామన్న మోదీ! కాంగ్రెస్‌, సీపీఎంపై నిప్పులు

Modi: త్రిమూర్తులతో త్రిపురను బలోపేతం చేస్తామన్న మోదీ! కాంగ్రెస్‌, సీపీఎంపై నిప్పులు

త్రిపుర ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగం

త్రిపుర ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగం

Elections: ఇక ఒకప్పుడు హింసకు మారుపేరైన త్రిపురలో సీపీఎం పోలీస్ స్టేషన్లను కూడా తమ ఆధీనంలో పెట్టుకుందని మోదీ ఫైర్‌ అయ్యారు. హింస అనేది త్రిపుర అస్తిత్వం కాదు అని.. కాంగ్రెస్‌, లెఫ్ట్ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటూ మండిపడ్డారు మోదీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల హీట్‌ పీక్స్‌కు చేరుతోంది. ఈ నెల 16న ఎన్నికలు జరగనుండడంతో ప్రధాని మోదీ ప్రచార బరిలోకి దిగారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. కాంగ్రెస్‌, సీపీఎం టార్గెట్‌గా ఫైర్‌ అయ్యారు. ధలై జిల్లాలోని అంబాస్సాలో జరిగిన తొలి ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. 'గృహనిర్మాణం-ఆరోగ్యం-ఆదాయం' అనే త్రిమూర్తులతో త్రిపురను బలోపేతం చేస్తామన్నారు మోదీ. ఈ త్రిమూర్తులు త్రిపురకు సాధికారత కల్పిస్తున్నాయన్నారు. పీఎం ఆవాస్ యోజన త్రిపుర పేద ప్రజల జీవితాలను మార్చేసిందన్నారు మోదీ. గత ఐదేళ్లలో మూడు లక్షల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చినట్లు మోదీ చెప్పారు.

గిరిజనుల కృషికి బీజేపీ:

దేశ నిర్మాణంలో గిరిజనుల కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తోందని చెప్పారు మోదీ. మళ్లీ డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం త్రిపురలో సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారాయన. 'ఫిర్ ఏక్ బార్, డబుల్ ఇంజిన్ కీ సర్కార్' అంటూ అన్ని వైపుల నుంచి మాటలు వినిపిస్తున్నాయన్నారు మోదీ. త్రిపురలో గ్రామాలను కలుపుతూ 5,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని.. అగర్తలాలో కొత్త విమానాశ్రయాన్ని కూడా నిర్మించామన్నారు. ఆప్టికల్ ఫైబర్ , 4జీ కనెక్టివిటీని గ్రామాలకు తీసుకొచ్చామని.. ఇప్పుడు త్రిపుర చాలా మారిపోయిందన్నారు. ఈశాన్య, త్రిపురలను ఓడరేవులతో కలిపేందుకు జలమార్గాలను అభివృద్ధి చేస్తునట్లు చెప్పారు మోదీ. ఇక ఒకప్పుడు హింసకు మారుపేరైన త్రిపురలో సీపీఎం పోలీస్ స్టేషన్లను కూడా తమ ఆధీనంలో పెట్టుకుందని మోదీ ఫైర్‌ అయ్యారు. హింస అనేది త్రిపుర అస్తిత్వం కాదు అని.. కాంగ్రెస్‌, లెఫ్ట్ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటూ మండిపడ్డారు మోదీ.

నిజానికి మోదీ సారథ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చిందంటారు విశ్లేషకులు. ఆగ్నేయ ఆసియాకు సింహద్వారంగా ఈశాన్య రాష్ట్రాలను తీర్చిదిద్దారంటారు. ఇక త్రిపురలో మౌలికంగా గిరిజన ప్రాబల్యం ఎక్కువ. గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది త్రిపుర రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అందుకే గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర… ఐపీటీఎఫ్‌తో 2018ఎన్నికల అప్పుడే బీజేపీ జత కట్టింది. ఎన్నికల్లో సీపీఎం కూటమిని ఓడించి అధికారానికి వచ్చింది.

First published:

Tags: Narendra modi, Tripura

ఉత్తమ కథలు