త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌కి ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం (Election Commission Of India) బుధవారం ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మార్చి 2న వెల్లడికానున్నాయి. నాగాలాండ్ అసెంబ్లీ పదవీకాలం మార్చి 12న ముగియనుండగా.. మేఘాలయ, త్రిపుర (Tripura) అసెంబ్లీల పదవీకాలం వరుసగా మార్చి 15, మార్చి 22న ముగుస్తుంది. నాగాలాండ్,(Nagaland) మేఘాలయలో(Meghalaya) ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నాగాలాండ్, త్రిపుర మరియు మేఘాలయలో ఓటర్ల సంఖ్య 62.8 లక్షలుగా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య - 31.47 లక్షలు. మొదటిసారి ఓటర్ల సంఖ్య 1.76 లక్షలు. మూడు రాష్ట్రాల్లో కలిపి 2.23 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. 17 ఏళ్లు నిండి 18 ఏళ్లు నిండని వారికి ముందస్తుగా నోటీసులు అందజేసే ఏర్పాటు చేశామని.., తద్వారా 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు కార్డు పొంది వారి పేర్లను చేర్చామని ఎన్నికల సంఘం తెలిపింది.
మూడు రాష్ట్రాల్లో 9000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ రాష్ట్రాల్లోనూ హింసను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. మూడు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్ల వాటా పెరుగుతోందన్నారు.నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 12 బీజేపీ , 26 NPF, 17 NDPP మరియు 4 ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌తో పాటు మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
రాజకీయంగా 2023 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం 9 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.వాస్తవానికి నాగాలాండ్ శాసనసభ పదవీకాలం మార్చి 12న ముగియగా, మేఘాలయ మరియు త్రిపుర అసెంబ్లీల పదవీకాలం వరుసగా మార్చి 15 మరియు మార్చి 22న ముగుస్తుంది. త్రిపుర, మేఘాలయ మరియు నాగాలాండ్ అంటే మూడు రాష్ట్రాల అసెంబ్లీలలో ఒక్కొక్కటి 60 మంది సభ్యులు ఉన్నారు.
Corona: చిన్నారులపై కరోనా తీవ్ర ప్రభావం.. మానసిక సమస్యలు, మాటలు రాకపోవడం, ఇతర అనారోగ్యాలు
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ 5 చోట్ల మినీ అన్నప్రసాద భవనాలు
బోర్డు పరీక్షలు, భద్రతా బలగాల కదలికలను దృష్టిలో ఉంచుకుని మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం వర్గాలు గతంలో సూచించాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధికారంలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఈశాన్య రాష్ట్రాలలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఏకైక పార్టీ మరియు మేఘాలయలో ప్రభుత్వాన్ని కలిగి ఉంది. రాబోయే ఎన్నికల్లో త్రిపురలో సీపీఐ , కాంగ్రెస్ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల్లో పొత్తులో పోటీ చేయనున్నాయని ప్రకటించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.