ASSEMBLY ELECTIONS 2022 UPDATES VOTING KICKS OFF IN GOA UTTARAKHAND POLLING FOR UP SECOND PHASE BEGINS PM MODI URGES VOTERS MKS
Assembly Elections 2022: రెండో దశ పోలింగ్ షురూ.. గోవా, ఉత్తరాఖండ్, యూపీ ఓటర్లకు PM Modi పిలుపిదే..
యువ ఓటర్ల సందడి
అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(సోమవారం) మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(సోమవారం) మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తరాఖండ్ లోని 70 సీట్లకు నేడు ఒకే దశలో పోలింగ్ ముగియనుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ రెండో దశలో 55 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కొవిడ్ జాగ్రత్తలతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈసీ చేపట్టింది.
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల్లోని ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. ‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో రౌండ్‌తో, ఉత్తరాఖండ్, గోవాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య పవిత్ర పండుగలో ఓటర్లందరూ పాల్గొని ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని అభ్యర్థిస్తున్నాను. ఆలస్యంగా కాదు, ముందుగానే వెళ్లి ఓటు వేయండి. ఆ తర్వాతే ఇతర పనులు..’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
యూపీ సెకండ్ ఫేజ్‌లో సహారన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్‌పూర్ జిల్లాలోని 55 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 586 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ఎస్పీ నేత మహమ్మద్ ఆజం ఖాన్‌తో పాటు ధరమ్ సింగ్ సైనీ, యూపీ ఫైనాన్స్ మినిస్టర్ సురేశ్ ఖన్నా తదితరులున్నారు. జైలులో ఉన్న ఎస్పీ నాయకుడు ఆజంఖాన్ రాంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ కుమారుడు అబ్ధుల్లా ఆజం కూడా స్వార్ సీటు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.
గోవా రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 301మంది అభ్యర్థుల భవితవ్యాన్ని గోవా ఓటర్లు నిర్ణయించనున్నారు. అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.గోవాలో సీఎం ప్రమోద్ సావంత్, ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్, మాజీ సీఎం చుర్చిల్ అలీమావో, మాజీ సీఎం కుమారుడు ఉత్పల్ పారికర్ లు పోటీ చేస్తున్నారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 70 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ ప్రారంభమైంది. 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 81 లక్షలమంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతోపాటు బీజేపీ మంత్రులు, కాంగ్రెస్ మాజీ సీఎం హరీష్ రావత్, ఆప్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో పోలింగ్ కోసం 60వేల మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.