Home /News /national /

ASSEMBLY ELECTIONS 2022 UPDATES 64PC VOTER TURNOUT IN PUNJAB AND 60PC IN UP 3RD PHASE MKS

Assembly Elections 2022: పంజాబ్ లో 64 శాతం పోలింగ్.. యూపీ మూడో దశలో 60శాతం ఓటింగ్

పంజాబ్ ఓటర్లు

పంజాబ్ ఓటర్లు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే దశలో ఆదివారం పూర్తయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ సైతం ఆదివారం ముగిసింది. ఓటింగ్ శాతం వివరాలిలా ఉన్నాయి..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో కీలక ఘట్టాలు ఒక్కొక్కటిగా విజయవంతం అవుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలకు పోలింగ్ పూర్తికాగా, ఆదివారం పంజాబ్ లోనూ ఎన్నికలు ముగిశాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఇవాళ్టితో మూడు దశల పోలింగ్ పూర్తయింది. ఇక్కడ మరో నాలుగు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఫిబ్రవరి 28, మార్చి5 పోలింగ్ ఉంటుంది. యూపీలో చివరిదైన ఏడోదశ పోలింగ్ మార్చి 7తో మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఇవాళ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే దశలో ఆదివారం పూర్తయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ సైతం ఆదివారం ముగిసింది. కాగా, 117 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్‌లో 63.94 శాతం ఓటింగ్ నమోదైందని, ఇక ఉత్తప్రదేశ్‌లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 58.07 శాతం నమోదు అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

CM KCR-Thackeray Meet: సోనియా గాంధీ అనుమతితోనే కేసీఆర్‌-ఉద్దవ్ ఠాక్రే భేటీ? అనూహ్య కోణం!


పంజాబ్‌లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ, ఆప్‌ల మధ్య హోరాహోరి పోటీ ఉన్నట్లు విశ్లేషణలువస్తున్నాయి. ఇక ఉత్తప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ కూటమి, బహుజన్ సమాజ్‌ పార్టీ ప్రధాన పోటీలో ఉన్నాయి. పోలింగ్‌లో అక్కడక్కడ చిన్న చిన్న చెదురు ముదురు సంఘటనలు జరిగినప్పటికీ మొత్తంగా ప్రశాంతంగా ముగిసినట్లు ఈసీ పేర్కొంది.

Modi Uprooting Terror: గుజరాత్ నుంచి గ్లోబల్ దాకా.. ఉగ్రవాద నిర్మూలనకు మోదీ అసామాన్య కృషి


పంజాబ్‌లో సినీ నటుడు సోనూ సూద్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన కాస్త వివాదాస్పదంగా మారగా.. యూపీలోని కాన్పూర్‌లో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశమైంది. ఇక ఇరు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Punjab, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు